బుల్లితెరలో రోజా రీ ఎంట్రీ... హీరో శ్రీకాంత్ షాకింగ్ వ్యాఖ్యలు!
గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఏపీలో చక్రం తిప్పిన రోజా ప్రస్తుతం మళ్లీ బుల్లితెరలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. రాజకీయాలలో తన మార్కు రాజకీయం చేసి నిత్యం చంద్రబాబును, తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేసిన మాజీ మంత్రి రోజా ఇప్పుడు గత ఎన్నికలలో ఓటమి పాలు కావడంతో మళ్లీ బుల్లితెరపైకి ఎంట్రీ ఇస్తున్నారు.
బుల్లితెరలో రోజా రీ ఎంట్రీ
గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా అవకాశం రావడంతో బుల్లితెరకు దూరమైన రోజా మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వటం ఆమె అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్న అంశం. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో లతో గతంలో ఎంతో బిజీగా ఉన్న రోజా ఇప్పుడు మళ్లీ బుల్లితెరలో బిజీ అయ్యేందుకు రెడీ అయ్యారు. జీ తెలుగులో తాజాగా సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ ఫోర్ లో ఆమె హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు.

ఎమ్మెల్యేగా రోజా ఓటమి
ఇక ఈ షోకి సంబంధించిన ప్రోమోను జీ తెలుగు ఇటీవల రిలీజ్ చేసింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రోజా కొద్ది రోజుల పాటు ఎవరికీ కనిపించలేదు. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న గుళ్లన్నీ తిరుగుతూ పూజలు, పునస్కారాలు చేసుకున్నారు. రాజకీయాలలో ప్రస్తుతం కాస్త సైలెంట్ గానే ఉంటున్న రోజా, మళ్ళీ తిరిగి బుల్లితెరపైన ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో ఒక షోలో జడ్జిగా రోజా ఎంట్రీ ఇచ్చారు.
రోజా పై శ్రీకాంత్ షాకింగ్ వ్యాఖ్యలు
ఇందులో హీరో శ్రీకాంత్, హీరోయిన్ రాశి లతో కలిసి రోజా జడ్జిగా వ్యవహరించబోతున్నారు. ఇక ఈ షో లాంచింగ్ ప్రోమోలో రోజా గురించి శ్రీకాంత్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటు రాశి ఇటు రోజా ఇద్దరి మధ్యలో నిలుచున్న శ్రీకాంత్ ఈవిడ నవ్వితే ముత్యాలు రాలుతాయి అంటూ రాశిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇక రోజాను ఉద్దేశించి ఈవిడ దగ్గర ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలుతాయి అంటూ శ్రీకాంత్ పేర్కొన్నారు.
మళ్ళీ బుల్లితెర పైకి రీఎంట్రీ
దీంతో రోజా తెగ నవ్వుకున్నారు. ఇక ఈ షోలో వీళ్ళ ముగ్గురితో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఉన్నారు. మొత్తానికి గత ప్రభుత్వంలో మంత్రిగా చాలా బిజీ బిజీగా ఉన్న రోజా, ప్రస్తుతం మళ్ళీ బుల్లితెర పైకి రీఎంట్రీ ఇస్తున్నారు.తన డ్యాన్స్ లతో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నారు.












Click it and Unblock the Notifications