లోకేష్ ఐరన్ లెగ్- అందుకే తారకరత్నకు గుండెపోటు-రోజా షాకింగ్ కామెంట్స్..
ఏపీ మంత్రి ఆర్కే రోజా నిన్న గుండెపోటుకు గురైన నందమూరి హీరో తారకరత్నపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పాదయాత్ర వల్లే ఆయనకు ఈ పరిస్దితి వచ్చిందన్నారు.
ఏపీలో నిత్యం తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న మంత్రి ఆర్కే రోజా తాజాగా మరో షాకింగ్ కామెంట్ చేశారు. ఇవాళ విశాఖపట్నంలోని శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి రోజా.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర గురించి మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సైకో అని, నారా లోకేష్ ఐరన్ లెగ్, సైకో అని రోజా వ్యాఖ్యానించారు.
లోకేష్ లాంటి ఐరన్ లెగ్ రాష్ట్రం అంతా నడిస్తే పరిస్థితి ఏంటి అని ప్రజలు భయపడుతున్నారని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. లోకేష్ మొదటిసారి గోదావరి పుష్కరాలకి వెళ్తే 29మందిని పొట్టన పెట్టుకున్నాడన్న రోజా..
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేస్తే వాళ్ళ నాన్నకి ఓటుకు నోటు కేసులో నోటీసులు వచ్చాయంటూ విమర్శించారు.
మొన్న పోస్టర్ లాంచింగ్ చేస్తే 8మంది చనిపోయారన్నారు. నిన్న పాదయాత్ర చేస్తే, తారకరత్న గుండెపోటు వచ్చిందంటూ రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు.

లోకేష్ పాండిత్యాన్ని చూసి ఆయన పులకేసి అనాలని మంత్రి రోజా తెలిపారు. నిరుద్యోగులంతా సంతోషంగా ఉన్నారని, రోడ్డు మీదకు వచ్చింది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఆ పార్టీలో కొంతమంది మాత్రమేనన్నారు.
చంద్రబాబు 11 మందిని చంపేశారని, నిన్న ఒకరికి హార్ట్ ఎటాక్ వస్తే మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని లోకేష్ నిన్నటి కామెంట్స్ ను ఉద్దేశించి రోజా కౌంటర్ ఇచ్చారు. తద్వారా తారకరత్నకు హార్ట్ ఎటాక్ వచ్చినా పట్టించుకోకుండా లోకేష్ తమను విమర్శిస్తున్నాడని రోజా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications