అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం: అక్కడికక్కడే నలుగురు మృతి

అమరావతి: అనంతపురంలో శనివారం తెల్లవారుజూమున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాదు-బెంగళూరు జాతీయ రహదారి జిల్లా మీదుగానే వెళుతున్న నేపథ్యంలో అనంతపురంలో ఇటీవల కాలంలో ప్రమాదాల సంఖ్య మరింతగా పెరిగింది.

పోలీసుల కథనం ప్రకారం కర్ణాటక రాష్ట్రం కొప్పల్‌ జిల్లా గంగావతిగ్రామానికి చెందిన ఏడుగురు మిత్రులు ఓమ్ని వ్యాన్‌లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అనంతపురంజిల్లా ముదిగుబ్బ మండలంలోని సంకేపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న సిమెంట్ లోడు లారీనిఢీకొంది.

Road accident at anantapur, four people died on Friday

ఈ ప్రమాదంలో కర్ణాటకలోని గంగావతికి చెందిన త్రినాథ్‌రెడ్డి, భీమ్‌సేన్‌రావు, విశ్వజిత్‌, భీమ్‌సేన్‌గౌడ్‌లు అక్కడిక్కడే మృతిచెందారు. మృుతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం. ఈ ప్రమాదంలో గాయపడ్డ చంద్రశేఖర్‌, వెంకటేశ్‌, సత్యనారాయణలను 108 వాహనంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు.

అనంతరం రక్త గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ ముగ్గురిని పోలీసులు హుటాహుటిన అనంతపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+