జాతీయరహదారిపై ఘోర ప్రమాదం: బీజేపీ నేతతోపాటు 9 మంది మృతి
అనంతపురం: జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిపై విడపనకల్ మండలం కొటాలపల్లి సమీపంలో ఇన్నోవా కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు.
మృతుల్లో ముగ్గురు బొమ్మనహళ్‌కు చెందినవారు కాగా, ఉరవకొండ మండలం లక్కవరం గ్రామానికి చెందిన ముగ్గురు ఉన్నారు. మిగితా వారి వివరాలు తెలియాల్సి ఉంది. లారీ, కారు బలంగా ఢీకొనడంతో కారు నుజ్జు నుజ్జయింది. మృతులంతా దగ్గరి బంధువులు కావడంతో ఘటనాస్థలంలో రోదనలు మిన్నంటాయి.

ఘటనా స్థలం నుంచి మృతదేహాలను పోలీసులు ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరంతా బళ్లారిలోని వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, ఈ ప్రమాదంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కోకా వెంకటప్ప మృతి చెందారు. వీరంతా ఆయన కుమార్తె వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది.
ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్ లారీ అధిక స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.












Click it and Unblock the Notifications