తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు ఏపీ విద్యార్థులు మృతి
చెన్నై: తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తిరువళ్లూరు సమీపంలో లారీని కారు ఢీ కొన్న ఘటనలో ఏపీలోని ఒంగోలుకు చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను నితీశ్ వర్మ, చేతన్ రామ్, యుకేష్, నితీశ్, చైతన్య విష్ణుగా గుర్తించారు.
ఈ విద్యార్థులంతా ఒంగోలులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. శనివారం ఒంగోలు నుంచి తిరువళ్లూరు వెళ్లిన విద్యార్థులు.. ఆదివారం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

వాగులో కొట్టుకుపోయిన కారు: ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి
ఓ వాగు ప్రవాహంలో కొట్టుకుపోవడంతో అందులోని ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మెహత్పూర్ సమీపంలోని డెహ్రా నుంచి పంజాబ్‌లోని ఎస్బీఎస్ నగర్‌లోని మెహ్రోవాల్ గ్రామంలో జరిగే వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
జైజోన్ ప్రాంతంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులో కారు కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో డ్రైవర్ తోపాటు మొత్తం 10 మంది కారులో ఉన్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో తీవ్ర విషాదం నెలకొది. ఒకరిని కాపాడిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఏడుగురు మృతదేహాను గుర్తించామని, వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టినట్లు డీఎస్పీ జాగిర్ సింగ్ తెలిపారు.
డ్యాం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఐదుగురు యువకులు
రాజస్థాన్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే జైపూర్‌కు సమీపంలోని కనోటా డ్యాంకు కూడా నీటి ప్రవాహం భారీగా వచ్చింది. ఆదివారం సెలవు కావడంతో ఈ డ్యాంను చూసేందుకు భారీగా సందర్శకులు వచ్చారు. వీరిలో ఐదుగురు యువకులు ప్రవాహంలో కొట్టుకుపోయారు. డ్యాంపై రీల్స్ చేస్తూ ఓ యువకుడు నీటి ప్రవాహంలో పడిపోయాడు. దీంతో అతడ్ని కాపాడేందుకు వెళ్లిన మరో నలుగురు కూడా గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ టీంలు వారి కోసం గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications