ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. డెంకాడ మండలం చందకపేట వద్ద ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
విజయనగరం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. డెంకాడ మండలం చందకపేట వద్ద ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను హుటాహుటిన విజయనగరం ఆస్పత్రికి తరలించారు. లారీ మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ ఘటన స్థలం నుంచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.












Click it and Unblock the Notifications