రాష్టంలో రక్తం ఓడిన రోడ్లు:రెండు ప్రమాదాల్లో 11 మంది మృతి...5గురి పరిస్థితి విషమం
కర్నూలు:రాష్ట్రంలో రోడ్లు రక్తం ఓడాయి...ఆదివారం ఉదయాన్నే జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 11 మంది ప్రాణాలు గాల్లో కలసిపోగా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
కర్నూలు జిల్లాలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా...మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు గుంటూరు జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ వాసులు మృత్యువాతన పడ్డారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదాలకు సంబంధించిన వివరాలు ఇవి...
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం సోమయాజులు పల్లె దగ్గర ఈరోజు ఉదయం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా...మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం ఈ ప్రమాదంలో మృత్యువాతన పడినవారి సంఖ్య తొమ్మిదికి చేరింది. మరో ముగ్గురు వ్యక్తులకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది.

కాగా ప్రమాదం జరిగిన వెంటనే ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో సమీపంలోని స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు, 108కు కాల్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం సమాచారం సేకరించారు. మృతులు కోడుమూరు మండలం కల్లపాడు గ్రామస్తులుగా గుర్తించారు. వీరు ఆటోలో మహానందికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. అతివేగం, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..మరో ఇద్దరు మృతి చెందారు. మొత్తం ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతులు. మిగతా ముగ్గురు వ్యక్తులకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. కాగా ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు, 108కు కాల్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సమాచారం సేకరించారు. మృతులు కోడుమూరు మండలం కల్లపాడు గ్రామస్తులుగా గుర్తించారు.
మృతులు కల్లపాడు సర్పంచ్ గౌరమ్మ, బోయ లక్ష్మీదేవి, ఈరమ్మ, మారెప్ప, చనుగొండ్ల గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, హుస్సేనమ్మ, గూడూరు గ్రామానికి చెందిన ఈరమ్మగా గుర్తించారు. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. వీరు ఆటోలో మహానందికి వెళ్తున్నారని సమాచారం. ఈ ప్రమాదానికి అతివేగం, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమని స్థానికులు చెబుతున్నారు.
మరోవైపు గుంటూరు జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ వాసులు మృతిచెందారు. నకరికల్లు మండలం దేచవరండొంక గ్రామం వద్ద జీపు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు తెలంగాణలోని నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన నరేష్, దేనుగా గుర్తించారు. సమాచారమందుకున్న పోలీసులు హూటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications