కత్తులతో బెదిరించి అర్థరాత్రి 3రైళ్లలో దోపీడీలు: సిలిండర్ పేలి ఒకరి సజీవ దహనం

అనంతపురం: జిల్లాలోని గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని గుత్తి రైల్వే స్టేషన్‌లో అర్థరాత్రి దోపిడీ దొంగలు వీరంగం సృష్టించారు. స్టేషన్‌లో ఆవరణలో నిలిపేయబడి ఉన్న రాయల సీమ, నాందేడ్, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లలో భారీ ఎత్తున చోరీలకు పాల్పడ్డారు.

ప్రయాణికులను కత్తులతో బెదిరించి 40 తులాల బంగారు అభరణాలను ఎత్తుకెళ్లినట్టు సమాచారం. గుత్తి డీఆర్‌ఎం భార్య వద్ద నున్న బ్యాగ్ నుంచి 8తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. 12మంది ముఠా ఈ చోరీలకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగల కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు.

Robberies in held in 3 trains at Gutti Station

గ్యాస్‌ సిలిండరు పేలి ఒకరి సజీవదహనం

పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకోడేరు మండలం శృంగవృక్షంలో గ్యాస్‌ సిలిండరు పేలిన సంఘటనలో రామకృష్ణ అనే వ్యక్తి సజీవదహనమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ: ఇద్దరి మృతి

నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద జాతీయరహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+