చరిత్రహీనుడు: చంద్రబాబుపై విరుచుకుపడిన రోజా
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు, సినీ నటి రోజా తీవ్రంగా విరుచుకుపడ్డారు. పదవి కోసం చంద్రబాబు నాయుడు తెలుగుజాతిని విభజించాలని కేంద్రానికి లేఖ ఇచ్చిన చరిత్రహీనుడని ఆమె వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి పదవి కోసం ఆనాడు మా అయిన ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన చరిత్ర కూడా చంద్రబాబుకు ఉందని ఆమె అన్నారు. శుక్రవారంనాడు ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తన హయాంలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఆమె చంద్రబాబును డిమాండ్ చేశారు.

పట్టిసీమ, గోదావరి పుష్కరాల్లో ఎంత తిన్నారో, అదే విధంగా జీవో నెంబర్ 22 ఇచ్చి ప్రాజెక్టు అంచనాలు పెంచడానికి ఎంత తీసుకున్నారో, దాంతో పాటు ఎమ్మెల్యేలను కొనడానికి రు. 5 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారో.. వాటిన్నింటికి సంబంధించిన శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఆమె అన్నారు.
కాంగ్రెసు పోరుసభలో ప్రత్యేక హోదా కోసం ఆత్మాహుతికి పాల్పడిన మునికామ కోటి కుటుంబ సభ్యులను రోజా శుక్రవారంనాడు పరామర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే మునికోటిని బలి తీసుకున్నాయని ఆమె విమర్సించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. తన అవినీతిని బయటపెట్టకుండా ఉండడానికి చంద్రబాబు బిజెపికి లొంగిపోయారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications