వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి.. ఆనాడే అలా చేసుంటే.. ఇప్పుడిలా?"

నారాయ‌ణ‌ కాలేజ్‌లో శ్రీ‌వ‌ర్ష‌లాంటి ఎంతో మంది ఆడ‌పిల్ల‌లు బలైపోతున్నా.. నారాయణ యాజమాన్యంపై ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కార్పోరేట్ కాలేజీల్లో వరుసగా విద్యార్థినుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. రాష్ట్రంలో ఆడపిల్లల పరిస్థితి దయనీయంగా తయారైందని, ఆడపిల్లల తల్లిదండ్రులు కారుస్తున్న కన్నీటిలో టీడీపీ ప్రభుత్వం కొట్టుకుపోతుందని మండిపడ్డారు.

తాజాగా హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్ పరిధిలో ఉన్న నారాయణ జూనియర్ క‌ళాశాల‌కు చెందిన‌ ఇంట‌ర్ రెండో సంవ‌త్స‌ర విద్యార్థిని శ్రీ‌వర్ష..మోతీనగర్‌లోని త‌న ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పోరేట్ కాలేజీల్లో విద్యార్థినుల మరణాలపై స్పందించారు రోజా.

నారాయ‌ణ‌ కాలేజ్‌లో శ్రీ‌వ‌ర్ష‌లాంటి ఎంతో మంది ఆడ‌పిల్ల‌లు బలైపోతున్నా.. నారాయణ యాజమాన్యంపై ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటిదాకా 21మంది ఆడపిల్లలు ఒక్క నారాయణ కాలేజీలోనే ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా రోజా పేర్కొన్నారు. ఇంత జరుగుతున్న చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులు ఉసురుపోసుకుంటుందని విమర్శించారు.

Roja criticized govt over the issue of students sucide

రాష్ట్రంలో మహిళా భద్రతా కరువైపోయిందని, విద్యార్థినులు, మ‌హిళ‌ల ప‌రిస్థితి చూస్తోంటే సిగ్గుతో త‌ల‌దించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్పడిందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో లావణ్య అనే అమ్మాయిని వెంటపడి వేధించి కారుతో గుద్ది చంపేసిన విషయాన్ని ఈ సందర్బంగా రోజా గుర్తు చేశారు. నంద్యాల ఆర్‌జీఎం కాలేజీలో ర్యాగింగ్ వేధింపులకు బలైపోయిన ఉషారాణి ఉదంతాన్ని గుర్తుచేశారు.

ఆడపిల్లల ఆత్మహత్యలను ఏకరువు పెట్టి ప్రభుత్వాన్ని నిలదీసిన రోజా.. సీఎం చంద్రబాబును కడిగిపారేశారు. తాను ఏంచేసినా చరిత్రే అని చెప్పుకునే చంద్రబాబు.. ఆడపిల్లల కన్నవాళ్ల కన్నీళ్లతో చరిత్ర రాస్తున్నారని అన్నారు. ఆడవాళ్లపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో, సరైన భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని ఆరోపించారు.

అప్పట్లో ఆడవాళ్లను వేధించిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై చర్యలు తీసుకుని ఉంటే.. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉండేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు రోజా. చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టే.. ఆయనకు వారి విలువ తెలియడం లేదని మండిపడ్డారు రోజా. ఆడపిల్లల ఆత్మహత్యలను అరికట్టడంలో విఫలమవుతున్న విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును తక్షణం కేబినెట్ నుంచి తప్పించాల్సిందిగా డిమాండ్ చేశారు రోజా.

English summary
AP YSRCP MLA Roja was attacked on tdp govt over the issue of woman security in state. She questioned govt for not taking actions on corporate colleges
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X