రేవంత్ తీగ లాగితే చంద్రబాబు డొంక కదులుతుంది: రోజా
నగరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, ప్రముఖ సినీ నటి రోజా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డారు. మంగళవారం నాడు నగరిలో రాస్తా రోకో నిర్వహించారు. ఇందులో రోజా పాల్గొని, మాట్లాడారు. రోజా, వైసీపీ పార్టీ కార్యకర్తలు రహదారిని దిగ్బంధించారు. దాదాపు గంటపాటు ధర్నా చేశారు.
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబును అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు తన సొంత తప్పును ప్రజల పైన రుద్దవద్దన్నారు. రేవంత్ రెడ్డి తీగ లాగితే చంద్రబాబు డొంక అంతా కదులుతుందన్నారు.

చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలను బెదిరించేవారని ఆరోపించారు. ఇప్పుడు సభలో కూడా అలాగే మాట్లాడుతున్నారని చెప్పారు.
రికార్డింగ్ టేప్ పైన పార్టీ వాళ్ళేమో ఆ గొంతు చంద్రబాబుది కాదంటే, చంద్రబాబు మాత్రం ఫోన్ ట్యాపింగ్ చేశారని అంటున్నారని, ఇందులో ఏది నమ్మాలని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి వ్యవహారం ప్రజలకు అందరికీ తెలుసునని చెప్పారు.












Click it and Unblock the Notifications