తుగ్గక్ పాలన: చంద్రబాబు పాలనపై రోజా నిప్పులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పరిపాలనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలన తుగ్లక్ పరిపాలనను తలపిస్తోందని ఆమె శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
రాజ్యాంగానికి విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం చీకటి జీవోలు జారీ చేస్తోందని ఆమె విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తోందని ఆమె అన్నారు. చీకటి జీవోలను రద్దు చేయకపోతే పోరాటం తప్పదని ఆమె హెచ్చరించారు.
చంద్రన్న పాలన ఇంటింటా దౌర్భాగ్యంలా ఉందని ఆమె అన్నారు. ప్రజాప్రతినిధుల హక్కులను చంద్రబాబు కాలరాస్తున్నారని ఆమె అన్నారు. ప్రజాప్రతినిధులను కాదని సెక్స్ రాకెట్ నిందితులకు, ఎన్నికల్లో ఓడిపోయిన టిడిపి నేతలకు అభివృద్ధి నిధులు ఎలా కేటాయిస్తారని ఆమె అడిగారు.

గ్రాడ్యుయేట్ బిచ్చగాళ్లలో ఎపికి రెండో స్థానం వచ్చిందని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని రోజా అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పది వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని అన్నారు.
జీవో 698లో పేర్కొన్న అంశాలు తప్పుల తడకగా ఉన్నాయని తప్పు పట్టారు. అందులోని పలు అంశాలను ఆమె ఈ సందర్భంగా ఉదహరించారు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని ఘనంగా చెప్పుకునే చంద్రబాబు ఇలా వ్యవహరించడం తగదని ఆమె అన్నారు. ఎపిలో అరాచకత్వం రాజ్యమేలుతోందని అన్నారు.












Click it and Unblock the Notifications