బోడిగుండుకు సన్మానాలా?, ‘జగన్-హోదా; ప్యాకేజీ-పప్పు’: గల్లా, లోకేష్‌పై రోజా తీవ్ర వ్యాఖ్యలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ నిరసనలు వ్యక్తం చేసిన టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏం సాధించారని సన్మానాలు చేయించుకుంటున్నారని, ర్యాలీలు తీస్తున్నారని మండిపడ్డారు.

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ గురించి ముందే తెలిసినా.. ఏం తెలియనట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని రోజా విమర్శించారు. టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రులుగా ఉన్నప్పుడు బడ్జెట్‌ గురించి చంద్రబాబుకు తెలియదనడం విడ్డూరంగా ఉందన్నారు.

ఆ బోడి గుండాయనకు సన్మానాలా..?

ఆ బోడి గుండాయనకు సన్మానాలా..?

అంతేగాక, కేంద్రం తీరును నిరసిస్తూ ఇటీవల ఏపీలో నిర్వహించిన ఆందోళనలో విజయవాడ సెక్స్ రాకెట్‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గుండు కొట్టించుకుని నిరసన తెలియజేశారని.. ఇంకో బోడిగుండాయన(గల్లా జయదేవ్) కేంద్రం మనకు ఏదో చేసేసిందని చెప్పి సన్మానాలు చేయించుకుని ఊరేగుతున్నారని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  TDP Unsure About Govt's Assurance On AP Bifurcation Act
   జయదేవ్ ఈ ప్రశ్నకు జవాబు చెప్పు..

  జయదేవ్ ఈ ప్రశ్నకు జవాబు చెప్పు..

  ‘ఈ గల్లా జయదేవ్‌ని నేనొక్కటే ప్రశ్నిస్తున్నాను. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో మీరు పెట్టుబడులు పెడతారా? లేదా?' అని రోజా నిలదీశారు. అంతేగాక, ‘ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టింది నిజం కాదా?' అని ప్రశ్నించారు.

  మోడీకి భయమా! మూడేళ్లు పడుకున్నావా?: బాబుకు తెలుసంటూ జగన్‌పై అచ్చెన్న నిప్పులు

   బాబు ఎందుకు మాట్లాడటం లేదు..?

  బాబు ఎందుకు మాట్లాడటం లేదు..?

  రాష్ట్రంలో సమయానికి టాయిలెట్లు కట్టించకపోతే కలెక్టర్లపై పోరాటం చేస్తానంటూ చంద్రబాబునాయుడు వారిని బెదిరిస్తున్నారని.. మరి ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు కేంద్రంపై పోరాటం చేస్తానని బాబు ఎందుకు మాట్లాడటం లేదని రోజా నిలదీశారు.

  జగన్! ఒక్క మాట మాట్లాడావా?, కాళ్లు మొక్కేందుకు తప్ప..: ఏకిపారేసిన సోమిరెడ్డి, గంటా

   హోదా అంటే జగన్.. ప్యాకేజీ అంటే పప్పు

  హోదా అంటే జగన్.. ప్యాకేజీ అంటే పప్పు

  ‘ప్రత్యేక హోదా అనేది వైయస్సార్ కొడుకు జగన్ లాంటిది. ప్రత్యేక ప్యాకేజీ అనేది చంద్రబాబునాయుడు ఇంట్లో ఉన్న ఎవరికీ పనికి రాని పప్పులాంటిది' అని రోజా తీవ్ర విమర్శలు చేశారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని మంత్రి లోకేశ్‌ అమెరికాలో పార్టీని అభివృద్ధి చేస్తాననడం హాస్యాస్పదమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చినప్పుడే ప్రతీ జిల్లా హైదరాబాద్‌లా అవుతుందని నాలుగేళ్లుగా జగన్ చెబుతూనే ఉన్నారని రోజా అన్నారు.

  విదేశాల్లో దాచుకుంటున్నారు..

  విదేశాల్లో దాచుకుంటున్నారు..

  ‘బడ్జెట్‌పై టీడీపీ ఎంపీలు ఒకలా, ఎమ్మెల్యేలు మరోలా మాట్లాడుతున్నారు. చిన్న విషయానికే మీడియా ముందుకు వచ్చే చంద్రబాబు.. బడ్జెట్‌ ప్రవేశపెట్టి ఇన్ని రోజులైనా దానిపై మాట్లాడడం లేదు. రాజధాని నిర్మిస్తున్నాం.. విదేశాల నుంచి కోకొల్లులుగా నిధులు వస్తున్నాయని మాయమాటలు చెప్పి కేంద్రం నుంచి నిధులు రాకుండా చేశారు. రాష్ట్రంలో దోచుకున్న సొమ్మును విదేశాల్లో దాచుకునేందుకు బాబు విదేశీ యాత్రలు చేస్తున్నారు' అని రోజా ఆరోపించారు.

  బాబు.. ఎన్టీఆర్‌ను మించిపోయారు

  బాబు.. ఎన్టీఆర్‌ను మించిపోయారు

  ఏపీకి నాలుగేళ్లుగా అన్యాయం జరుగుతుంటే సీఎం చంద్రబాబు అడగకుండా ఏం చేస్తున్నారు? కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అందరం కలిసి పోరాడదామంటే చంద్రబాబు అంగీకరించరు! అందరినీ కలుపుకుని పోవాలంటే ఆయన ‘ససేమిరా' అంటున్నారు. కేంద్రంలో పదవులూ కావాలి, ఇటు సన్నాయి నొక్కులు నొక్కాలన్నట్టుగా టీడీపీ ఆడుతున్న డ్రామాలను చూస్తున్నాం' అని రోజా వ్యాఖ్యానించారు. నటనలో చంద్రబాబు.. ఎన్టీఆర్‌ను మించిపోతున్నారని అన్నారు. కొందరు టీడీపీ ఎంపీలు నిరసన చేస్తారు.. మరికొందరు కేంద్రమంత్రి పదవులు అనుభవిస్తారని అన్నారు. కేంద్రంతో కుమ్మక్కై రాష్ట్రానికి రావాల్సిన హోదాను సమాధి చేస్తున్నారని మండిపడ్డారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSRCP MLA RK Roja on Wednesday fired at TDP MP Galla Jayadev and andhra Pradesh minister Nara Lokesh.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి