చిరంజీవి విషయంలో పవన్ కళ్యాణ్ రోడ్లపై దొర్లలేదే; చంద్రబాబుపైనా రోజా ఘాటువ్యాఖ్యలు!!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి, జైలుకు పంపడంతో సంబరాలు జరుపుకున్న మంత్రి రోజా తాజాగా చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది అంటూ మంత్రి రోజా విమర్శించారు .చంద్రబాబు అవినీతిలో కూరుకు పోయాడని, బోగస్ కంపెనీలతో దోచుకున్న కరప్షన్ కింగ్ అని మంత్రి రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఈడీ విచారణ జరిగింది నిజం కాదా? జిఎస్టి అధికారులు చంద్రబాబుకు లేఖ రాసిన మాట నిజం కాదా? బాబుకు ఐటీ నోటీసులు ఇచ్చింది నిజం కాదా? చెప్పాలని ప్రశ్నించిన రోజా పక్కా ఆధారాలతో దొరికిన కూడా కొందరు గగ్గోలు పెడుతున్నారని, వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు ఇంతకాలం తప్పించుకున్నారని, ఇప్పుడు తప్పించుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు.

Roja

స్కిల్ డెవలప్మెంట్ స్కాం పాత్రధారి, సూత్రధారి చంద్రబాబేనని మండిపడిన రోజా, చంద్రబాబు తనకు ఉన్న అధికారాన్ని దోపిడీ కోసమే ఉపయోగించారని ఆరోపించారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే కోర్టు రిమాండ్ కు పంపిందని పేర్కొన్న రోజా అసలు స్కిల్ కుంభకోణం జరగలేదని, తాను ఏ తప్పు చేయలేదని చెప్పగలరా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు.

చంద్రబాబు లాయర్లు కూడా కుంటి సాకులపై వాదనలు వినిపించారని ఎద్దేవా చేశారు. ఇక నేడు జరుగుతున్న టిడిపి బంద్ ను ఉద్దేశించి టిడిపి బంద్ ను ప్రజలు పట్టించుకోరని, సాక్షాధారాలతో దొరికి కూడా బంద్ కు పిలుపునిస్తారా? అంటూ ప్రశ్నించారు.అమరావతిలో భూములను దోచుకున్నారని, పోలవరం, పట్టిసీమ ఇలా చంద్రబాబు చేయని స్కాములు లేవని ప్రజల నెత్తిన టోపీ పెట్టి నిధులు దోచేశారు అని రోజా విమర్శించారు.

ఇప్పుడు చంద్రబాబును ప్రజలు నమ్మరని రోజా పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన రోజా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ చంద్రసేన గా మార్చేశారని అవినీతికి పాల్పడిన వ్యక్తికి మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు, ప్యాకేజీ స్టార్ అని విమర్శించారు.

ముద్రగడ ని చంద్రబాబు ఇబ్బంది పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఏమయ్యారని ప్రశ్నించారు .మీ అన్నయ్య చిరంజీవిని ఎయిర్పోర్టులో అడ్డుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు రోడ్లపై దొర్లలేదని ప్రశ్నించారు. చంద్రబాబు షెల్ కంపెనీలలో పవన్ కి కూడా వాటా ఉన్నట్టుంది అంటూ రోజా అనుమానం వ్యక్తం చేశారు. ఇక ఈ కేసులో అన్ని వ్యవహారాలు త్వరలోనే బయటకు వస్తాయని మంత్రి రోజా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+