• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి అయ్యే వేళ రోజా ఎమోషనల్ - ఇక వాటన్నిటికీ బైబై : టీడీపీ- తోక పార్టీకి ఎక్కడో కాలుతోంది..!!

|
Google Oneindia TeluguNews

ఆర్కే రోజా. వైసీపీ ఫైర్ బ్రాండ్. ఇప్పుడు మంత్రి రోజా. ప్రమాణ స్వీకారం వేళ రోజా కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను పదేళ్ల పాటు టీడీపీలో పని చేసినా..ఎమ్మెల్యేగా కూడా అవకాశం ఇవ్వలేదంటూ చెప్పుకొచ్చిన రోజా..తాను జగన్ కోసం ఏ విధంగా ఉంటాననేది స్పష్టం చేసారు. మంత్రి పదవి స్వీకరిస్తున్న వేళ.. తాను ఇక నుంచి షూటింగ్స్ కు దూరంగా ఉంటానని ప్రకటించారు. సినిమాలతో పాటుగా జబర్ధస్త్ కి సైతం బైబై చెప్పారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తాను జగన్ ను ఎమ్మెల్యే చేయమని కోరానని..కానీ, జగన్ ఇప్పుడు మంత్రిగా చేసారని ఎమోషనల్ అయ్యారు.

ఆ పార్టీలకు ఎక్కడో కాలుతోంది

ఆ పార్టీలకు ఎక్కడో కాలుతోంది

ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు కావటంతో..తిరుపతి జిల్లా నుంచి తనకు అవకాశం దక్కిందని చెప్పుకొచ్చారు. తాను యాక్టింగ్ చేయాలని చాలా మంది కోరుతున్నా.. ఇప్పుడు మంత్రిగా బాధ్యత పెరిగిందన్నారు. సీఎం జగన్ ఏనాడు షూటింగ్ ఎందుకు చేస్తున్నావని అడగలేదని చెప్పారు. తాను ఏ రోజు ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోలేదని.. ప్రతిపక్షాల పైన మాత్రం రాజకీయంగా విమర్శలు చేస్తానని స్పష్టం చేసారు. ఎమ్మెల్యేగా తనను అసెంబ్లీ లో చూడకూడదని చెప్పిన చంద్రబాబు..ఇప్పుడు అసెంబ్లీలో కనిపించటం లేదన్నారు. తనకు మంత్రిగా అవకాశం ఇవ్వటంతో టీడీపీతో పాటుగా తోక పార్టీకి ఎక్కడో కాలుతోందని వ్యాఖ్యానించారు.

చివరి నిమిషం దాకా టెన్షన్ తప్పలేదు

చివరి నిమిషం దాకా టెన్షన్ తప్పలేదు

తాను కష్టపడి గెలివటంతో భావోద్వేగం వచ్చిందని..ఇప్పుడు కేబినెట్ లో సైతం చివరి నిమిషం లో ఖరారు అయిందని చెప్పుకొచ్చారు. ఆ టెన్షన్.. ఆ ఒత్తిడి తో మంత్రి పదవి దక్కటంతోనే భావోద్వేగం ఆపుకలేకపోయానని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తమది ఎన్నికల కేబినెట్ గా చెబుతూ..తిరిగి జగన్ ను సీఎం చేయటం కోసమే తాను పని చేస్తానని స్పష్టం చేసారు. 2024 కే కాదు..20 ఏళ్లు జగన్ సీఎం గా ఉండేలా తామంతా పని చేస్తామి ధీమా వ్యక్తం చేసారు. సామాజిక సమీకరణాలు..ప్రాంతీయ సమీకరణాల కారణంగా చివరి నిమిషం వరకు తనకు మంత్రి పదవి పైన టెన్షన్ తప్పలేదన్నారు.

అదంతా టీడీపీ ప్రచారం మాత్రమే

అదంతా టీడీపీ ప్రచారం మాత్రమే


తాను మావోయిస్టు ప్రభావం ఉన్న సమయంలోనే టీడీపీ కోసం భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో పార్టీ కోసం పని చేసానని గుర్తు చేసుకున్నారు. అటువంటి తనను ఐరెన్ లెగ్ అంటూ ప్రచారం చేసారన్నారు. తనకు ఏ పార్టీలోనూ అవకాశం రాకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు అండ్ టీం ఆ విధంగా ప్రచారం చేసిందని చెప్పుకొచ్చారు. కానీ, జగన్ మాత్రం తనను పూర్తిగా నమ్మారని చెప్పుకొచ్చారు. ఈ రెండేళ్లు పూర్తిగా పార్టీ కోసం.. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా రాష్ట్రం కోసం పని చేస్తానంటూ రోజా స్పష్టం చేసారు. అయితే, రోజాకు ఇచ్చే శాఖ పైన సీఎం ఏ బాధ్యతలు అప్పగించినా..తాను వాటిని సమర్ధవంతంగా నిర్వహిస్తానని వెల్లడించారు.

English summary
MLA Roja who has been promoted as cabinet Minister said that she will bid farewell to all the shootings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X