వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాట్లాడనివ్వలేదు, సభ గౌరవాన్ని దిగజార్చారని..: సస్పెన్షన్‌పై హైకోర్టుకు రోజా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విజయవాడ: తన సస్పెన్షన్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నటి రోజు హైకోర్టు గడప తొక్కారు. ఆమె గురువారం నాడు హైకోర్టును ఆస్రయించారు. తన సస్పెన్షన్‌ను రద్దు చేయాలని, తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేలా ఉత్తర్వులివ్వాలని కోర్టును కోరారు.

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది అసెంబ్లీలో కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశంపై జరిగిన వాగ్వాదం సందర్భంగా... రోజా అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశారని, సభాపతి స్థానాన్నే అవమానించేలా మాట్లాడారని, తద్వారా సభా నియమాలను ఉల్లంఘించారన్న ఆరోపణలు వచ్చాయి.

ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం ప్రతిపాదించిన తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆమోదించారు. దీంతో రోజా పైన ఏడాది పాటు సస్పెన్షన్ విధించారు. రోజా పైన ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేయడాన్ని వైసిపి ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Roja knocks High Court on suspension

ఈ నేపథ్యంలో రోజా తాజాగా సభాపతి నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. తనపై విధించిన సస్పెన్షన్ బిజినెస్ రూల్స్‌కు విరుద్ధమని ఆమె చెప్పారు. సస్పెన్షన్ ఉత్తర్వులను సైతం తనకివ్వలేదని వాపోయారు. స్పీకర్ తన హక్కులను కాలరాశారన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోర్టును అభ్యర్థించారు.

నిబంధనల ప్రకారం సస్పెన్షన్ ఒక సెషన్‌కు మాత్రమే పరిమితం చేయాల్సి ఉన్నా స్పీకర్ దానిని ఉల్లంఘించి ఏడాది పాటు సస్పెండ్ చేశారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయం వల్ల తాను మార్చి 1 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందన్నారు.

నా వాదన వినిపించే అవకాశమే ఇవ్వలేదు

'గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ నుంచి జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన అనేక చర్చలతో పాటు కాల్ మనీ - సెక్స్ రాకెట్ కుంభకోణంపై చర్చ జరిగింది. ఈ కేసులో నిందితులకు, అధికార పార్టీకి మధ్య ఉన్న అనుబంధంపై నేను పలు ప్రశ్నలు సంధఇంచా. అయితే అధికార పార్టీ సభ్యులు నాపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

ఆయన నాపై సస్పెన్షన్ తీర్మానం చేయాలని సూచించారు. వారు తీర్మానం ప్రవేశ పెట్టడం, దానిని స్పీకర్ ఆమోదించి.. నన్ను ఏడాది పాటు సస్పెండ్ చేయడం వెంటవెంటనే జరిగాయి. కానీ సస్పెన్షన్ కాపీ నాకు ఇవ్వలేదు. అసలు సస్పెన్షన్‌కు ముందు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు' అని రోజా అందులో పేర్కొన్నారు.

'నేను అసభ్య పదజాలం వాడానని, తద్వారా శాసన సభ గౌరవాన్ని దిగజార్చానని సస్పెన్షన్ పైన చర్చ సందర్భంగా చెప్పారు. నా వాదన వినిపించే అవకాశమే ఇవ్వలేదు. నా ప్రవర్తనపై అభ్యంతరం ఉంటే ఒక సెషన్‌కు సస్పెండ్ చేయాలి తప్ప ఏడాది పాటు నిబంధనలకు విరుద్ధం' అని పేర్కొన్నారు.

English summary
YSR Congress Party Nagari Roja knocks High Court on suspension.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X