'రోజా రెచ్చగొట్టి చీరలాగించుకోవాలనుకుంటోంది'
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో దుశ్శాసన పర్వానికి తెర తీయాలన్న ఆలోచనలో ఉన్నారని, ఆమె ఎంత రెచ్చగొట్టినా టీడీపీ సభ్యులు హద్దుమీరబోరని ప్రభుత్వ విప్ యామినీ బాల మంగళవారం చెప్పారు. ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి ఆమె చీర లాగించుకోవాలనుకొంటోందని, తమది శ్రీకృష్ణ జాతి అని, ఆమె చీర ఎవరైనా లాగితే అడ్డుకుంటామని, తమ నాయకుడు చంద్రబాబు మహిళా పక్షపాతి అని వ్యాఖ్యానించారు.
నోరు, చేతులే అనుకున్నాం... ఏకంగా అసెంబ్లీలోనే ఆమె కాలెత్తుతున్నారని, అయినా జగన్ కనీసం వారించడం లేదన్నారు. తమ సభ్యులెవరైనా చిన్న మాట జారితే మా నాయకుడు చంద్రబాబు వెంటనే వారివైపు చూస్తున్నారని, హద్దులు దాటొద్దు అనే చూపులతోనే హెచ్చరిస్తున్నారని చెప్పారు. దళితులపై మరోసారి అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తే రోజా నోరు చీరేస్తామని హెచ్చరించారు.

మంత్రి పీతల సుజాతపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే ఎమ్మెల్యే రోజా రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తెలిపారు. మాజీ మంత్రి మారెప్పతో కలిసి ఆయన విలేకరుతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ అధ్యక్షులు జగన్ చట్టసభల్లో అహంకారపూరితంగా వహరిస్తున్నారన్నారు. రోజా తీరు మహిళా లోకానికే తలంపు తెచ్చేలా ఉందన్నారు.
ఎస్సీలపై ప్రేమ ఉందని చెబుతున్న వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీటు దళితులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ కాదని యంగ్ స్టార్ రెడ్డీస్ పార్టీ అని మారెప్ప అభివర్ణించారు. ఆ పార్టీలో రెడ్లదే ఆధిపత్యమన్నారు.












Click it and Unblock the Notifications