జగన్‌కు ఆశీర్వాదాలు, చిత్తూరు నుంచే ఎక్కువ: రోజా, మళ్లీ హిందుపురం నుంచే: బాలకృష్ణ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడి ఆశీస్సులు తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉండాలని, ఆయన ద్వారా రాష్ట్రం అభివృద్ధి వైపు నడవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, ఎమ్మెల్యే రోజా అన్నారు.

చదవండి: 'స్వరం మార్చిన రోజా, జగన్‌కు ఇబ్బందులు మొదలు, రాత్రుళ్లు మాట్లాడుకుంటున్నారు'

జగన్ ప్రజా సంకల్ప యాత్ర గురువారం చిత్తూరు జిల్లాలో ప్రవేశించిందన్నారు. గత ఎన్నికల్లో చూస్తే వైసీపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన ఘనత చిత్తూరు జిల్లాదే అన్నారు. ఈసారి కూడా వైసీపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను ఇక్కడి నుంచే ఇచ్చేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు.

చదవండి: అర్థంకాడు, నేనెవర్ని చెప్పడానికి: పవన్‌పై కేటీఆర్, అల్లు అర్జున్, సమంత, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్‌లపై

2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాను హిందూపురం నుంచే పోటీ చేస్తానని ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. అనంతపురం జిల్లా గొల్లపల్లి నుంచి హిందూపురం పట్టణానికి నిర్మించనున్న వాటర్ పైపులైన్ పనులకు ఆయన శుక్రవారం భూమి పూజ చేశారు.

Roja prays for YS Jagan, Balakrishna says he will contest from Hindupur again

ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ పైపులైన్ నిర్మాణం ద్వారా హిందూపురం పట్టణవాసులకు మంచినీటి ఎద్దడి తొలగిపోనుందన్నారు. పేద, బడుగులు, రైతులు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.

చదవండి: పవన్ కళ్యాణ్ మాట, రజనీ మనసులో మాట!: కానీ, చిరంజీవిని లాగి పొరపాటు చేశారా?

ఈ సందర్భంగా 106 మంది రైతులకు రైతు రథం ట్రాక్టర్లను, మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లను ఆయన పంపిణీ చేశారు. రైతులతో కలిసి బాలకృష్ణ ట్రాక్టర్ నడిపి అందరినీ ఉత్సాహపరిచారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress leader and MLA Roja prays for YS Jagan, Balakrishna says he will contest from Hindupur again.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి