రోజా దిష్టిబొమ్మ దగ్ధం: కడపలో తెలుగు మహిళ ఫిర్యాదు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రి పీతల సుజాతపై వైయస్సార్ కాంగ్రెసుపార్టీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోజా దిష్టిబొమ్మను దహనం చేశారు. రోజా దళిత జాతిని అవమానించారని ఆరోపించారు. రోజాపై అట్రాసిటీకేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇదిలావుంటే, ఎస్సీ, ఎస్టీలను కించపరిచే విధంగా మాట్లాడిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే రోజాపై అట్రాసిటి కేసు నమోదు చేయాలని కడప తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం తెలుగు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో ఘటనలో కర్నూలులో రోజా దిష్టిబొమ్మను టీడీపీ కాక్యకర్తలు దగ్ధం చేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సర్కిల్‌లో రోజా తీరుకు టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు.

ఆమె పద్ధతి మార్చుకోవాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. రోజా ఎమ్మెల్యేగా అనర్హురాలని, అమెను సభ నుంచి బహిష్కరించాలని టీడీపీ మహిళా కార్యకర్తలు డిమాండ్ చేశారు. మంత్రిని కించపరిచిన ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
గత కొద్ది రోజులుగా రోజాకు, పీతల సుజాతకు మధ్య మాటల యుద్ధం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఇరువురు పరస్పరం మాటల ఈటెలు రువ్వుకుంటున్నారు. రోజా తీరుపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు.












Click it and Unblock the Notifications