ఆరోజు నువ్వే కదా ఉన్నావ్: విజయసాయి రాజీనామాపై బాబుకు రోజా దిమ్మతిరిగే కౌంటర్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ లోకసభ ఎంపీలు రాజీనామా చేశారు కానీ, రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి వంటి వారు ఎందుకు చేయలేదనే తెలుగుదేం పార్టీ నేతల ప్రశ్నలకు ఆమె ఘాటుగా స్పందించారు.

  హోదా అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఆనంద నగరాలు : రోజా

  అంతేకాదు, స్వర్గీయ నందమూరి తారక రామారావులో జరిగిన సంఘటనతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆమె చంద్రబాబుకు, టీడీపీకి కౌంటర్ ఇచ్చారు. అప్పుడు ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోవాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సూచించారు. ఇప్పుడు తమ రాజ్యసభ ఎంపీల రాజీనామాకు డిమాండ్ చేసే అధికారం లేదన్నారు.

  ఎన్టీఆర్ ఏం చేశారు, ఆ రోజు నువ్వే కదా పక్కన ఉన్నావు

  ఎన్టీఆర్ ఏం చేశారు, ఆ రోజు నువ్వే కదా పక్కన ఉన్నావు

  తమ రాజ్యసభవ ఎంపీల రాజీనామా డిమాండ్ చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడును ఈ రోజు ఓ మాట అడుగుతున్నానని, గతంలో బోఫోర్స్ కుంభకోణం సమయంలో ఎన్టీఆర్ హయాంలో ప్రతిపక్ష ఎంపీలంతా రాజీనామా చేశారని, ఆ రోజు ఎన్టీఆర్ గారు తన లోకసభ ఎంపీలతో రాజీనామా చేయించారని రోజా చెప్పారు. రాజ్యసభ సభ్యులతో మాత్రం నాడు ఎన్టీఆర్ రాజీనామా చేయించలేదని, ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. ఆ రోజు నువ్వే (చంద్రబాబు) కదా పక్కన ఉన్నావు అని నిలదీశారు. చంద్రబాబు జవాబు చెప్పాలన్నారు.

  హరికృష్ణకు వెన్నుపోటు పొడిచి రాజీనామా చేయించావ్

  హరికృష్ణకు వెన్నుపోటు పొడిచి రాజీనామా చేయించావ్


  సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలోను నందమూరి హరికృష్ణకు వెన్నుపోటు పొడిచి రాజీనామా చేయించిన చంద్రబాబు, తన బినామీ అయిన సుజనా చౌదరితో మాత్రం రాజీనామా చేయించలేదని, అలా ఎందుకు చేశారో చెప్పాలని రోజా నిలదీశారు. మీ ఎంపీలతో రాజీనామా చేయించే దమ్ము, ధైర్యం లేను నువ్వు ఈ రోజు సిగ్గులేకుండా వైసీపీపై నిందలు వేయడానికి ఏం అర్హత ఉందో చెప్పాలని మండిపడ్డారు. కాగా, చంద్రబాబు ప్రారంభించిన ఆనంద నగరిపై రోజా ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. బుధవారం తన ప్రెస్ మీట్‌ను పోస్ట్ చేశారు.

  హోదా ఉద్యమం జరుగుతుంటే ఆనంద నగరాలా?

  హోదా ఉద్యమం జరుగుతుంటే ఆనంద నగరాలా?

  'ప్రత్యేక హోదా కోసం రాష్ట్రమంతటా ఆందోళనలు, ఆగ్రహావేశాలు పెల్లుబిగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆనంద నగరాలు పేరుతో వేడుకలు నిర్వహించడం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఇలాంటి పనికిమాలిన కార్యక్రమానికి తెలుగువారైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకావడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వ పథకాలపై 71 శాతం మంది సంతృప్తిగా ఉన్నారన్న సీఎం వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్‌ ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఎన్నికలకు వెళదామని సవాలు విసిరారు.

  టీడీపీ సిద్ధమా

  టీడీపీ సిద్ధమా

  టీడీపీ ప్రభుత్వ పథకాలపై 71శాతం సంతృప్తి ఉందట! రుణమాఫీ కాక రైతులు అప్పులపాలైనందుకా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వచ్చినందుకా, ఇంటికో ఉద్యోగం, దళితులకు ఇళ్లు దక్కినందుకా? అమరావతిని స్కాం క్యాపిటల్‌గా మార్చినందుకా? ఏ విషయంలో జనం సంతృప్తిగా ఉన్నారు?. నాడు వైఎస్సార్‌ అంటే ఆరోగ్యశ్రీ, రెండు రూపాయలకు కిలో బియ్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉచిత కరెంట్‌ లాంటి పథకాలు గుర్తొచ్చేవి. మరి చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఏ ముఖ్యమంత్రి పాలననైనా ప్రజలు పొగుడుతారు కానీ చంద్రబాబు మాత్రం తనను తానే పొగుడుకుంటారు. ప్రజలంతా సంతోషంగా ఉంటే వెంటనే ఎన్నికలకు వెళదాం. టీడీపీ సిద్ధమేనా? అని రోజా ప్రశ్నించారు.

  సిగ్గుచేటు కాదా?

  సిగ్గుచేటు కాదా?

  ఏపీకి చెందిన అందరు ఎంపీలూ రాజీనామాలు చేసి ఉంటే ఈ పాటికి కేంద్రం దిగివచ్చేదని రోజా అన్నారు. కానీ చిత్తశుద్దిలేని చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామాలు చేయించరని, ఢిల్లీలో డ్రామాలు చేసి, రాజీనామాలు చేయకుండా వచ్చిన టీడీపీ ఎంపీలను ప్రజలంతా తరిమికొట్టాలని, నాడు సమైఖ్యాంద్ర ఉద్యమంలో భాగంగా నందమూరి హరికృష్ణతో రాజీనామా చేయించిన చంద్రబాబు, ఇవాళ తన బినామీ సుజనా చౌదరితో ఎందుకు చేయించలేదని, హోదా కోసం ఆందోళనలు చేస్తోన్న వైసీపీ కార్యకర్తలను పోలీసులతో అడ్డగించడం సిగ్గుచేటుకాదా? మీరు 30 సార్లు ఢిల్లీకి వెళ్లింది నియోజకవర్గాల పెంపు కోసం కాదా అని నిలదీశారు.

  పవన్ కళ్యాణ్ సంతోషం

  పవన్ కళ్యాణ్ సంతోషం

  నాలుగేళ్లలో కనీసం నాలుగు అంతస్తుల భవనం కూడా కట్టలేని టీడీపీ ప్రభుత్వం అక్రమార్జనలో మాత్రం ఆకాశాన్ని దాటిపోయిందని రోజా ఆరోపించారు. మూడు సెంటీమీటర్ల వర్షానికే తాత్కాలిక సెక్రటేరియట్‌ భవనంలోకి ఆరు సెంటీమీటర్ల నీళ్లు వచ్చాయని, 13 మంది మంత్రుల పనితీరు భేష్‌ అని సీఎం అంటున్నారని, అవునుమరి.. ఒక్క రోడ్డు కూడా వేయలేని సీఎం కొడుకు విశ్వవిఖ్యాత పప్పు సార్వభౌమకు, విచ్చలవిడిగా బార్లు పెట్టి మహిళల జీవితాలను నాశనం చేస్తోన్న ఇతర మంత్రులకు ఈ కితాబు దక్కాల్సిందే అన్నారు. నాలుగేళ్లపాటు ఏకపక్షంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి ఇవాళ అఖిలపక్షం భేటీకి పిలిస్తే ఏఒక్కరూ వెళ్లని పరిస్థితి అని, ఇక పవన్‌ కళ్యాణ్ హోదా కోసం కనీసం రెండు కిలోమీటర్లైనా నడవటం సంతోషమన్నారు. ఇదిలా ఉండగా,రోజాా సదర్న్ రైల్వే జీఎం ఆర్కే కులక్క్షేత్రను కలిసి తన నియోజకవర్గమైన నగరి నియోజకవర్గములో చేయవలసి ఉన్న రైల్వే స్టేషన్ల అభివృధ్ది పనుల గురించి వివరించారు. తమ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అంశాలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. గురువారం ఆమె కలిశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSR Congress Party MLA Roja tries to corner TDP with NTR and Harikrishna.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి