చంద్రబాబుకు తలనొప్పి: మళ్లీ తెరపైకి బెజవాడ ఆలయాల తొలగింపు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: బెజవాడ ఆలయాల తొలగింపు ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. శుక్రవారం కృష్ణలంకలోని మార్వాడీ ఆలయం తొలగింపుకు అధికారులు యత్నించారు. ఆలయాల తొలగింపు స్వామీజీలు అడ్డుకోవడం అక్కడ పరిస్థితి ఉద్రికంగా మారింది.

తప్పంతా వారిదే!: బీజేపీ రాకతో తలొగ్గిన చంద్రబాబు ప్రభుత్వం (ఫోటోలు)

మరోవైపు గురువారం రాత్రి కృష్ణానది తీరంలో 80 సంవత్సరాలకు చెందిన రామాలయం, ఆంజనేయ స్వామి ఆలయాలను తొలగించారు. దీంతో ఆలయాల తొలగింపునకు వ్యతిరేకంగా ఆగస్టు 1న విజయవాడలో భారీ ఆందోళన నిర్వహించాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు వెల్లడించారు.

ఈ సందర్భంగా స్వామిజీలు మాట్లాడుతూ 80 ఏళ్లకు చెందిన ఆలయాలను అధికారులు తొలగించడం దారుణమన్నారు. అధికారులు ఆలయాల తొలగింపు ప్రక్రియ చేపట్టినప్పుడు ఓ కమిటీ వేసి ఆలయ నిర్వహకులకు చెప్పాలని, ఆలా చేయకుండా తొలగించిన ఆలయాలకు ప్రత్యామ్నాయం చూపించడం లేదని మండిపడ్డారు.

row over demolition of temples in vijayawada

త్వరలో జరగనున్న కృష్ణా పుష్కరాలకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు ఈ ఆలయలాను సందర్శించుకుంటారని, కానీ ఇప్పుడు అధికారులు ఆలయాలను తొలగించడంతో వారు ఎక్కడికి వెళ్లాలంటూ స్వామిజీలు ప్రశ్నించారు. మరోవైపు స్థానికులు సైతం అధికారుల చర్యలను తప్పుబట్టారు.

1970ల్లో నిర్మించిన ఈ రెండు ఆలయాలను రాత్రికి రాత్రే తొలగించడంపై మండిపడ్డారు. కార్తీక మాసంలో కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసే భక్తులు అనంతరం ఈ ఆలయాలను దర్శించుకునే వారని తెలిపారు. ఇదిలా ఉంటే త్వరలో జరగనున్న కృష్ణా పుష్కరాల కోసం బెజవాడలోని కృష్ణానదీ తీర ప్రాంతంలో ఉన్న పలు ఆలయాలను అధికారులు రాత్రికి రాత్రే కూల్చివేస్తున్నారు.

ఆలయాల కూల్చివేత: చంద్రబాబుకు పీఠాధిపతుల సెగ, ఖండించిన వైసీపీ

ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతుంది. ఇటీవలే ఆలయాల తొలగింపు అంశం మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య అగాథాన్నే సృష్టించింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు కలగజేసుకుని ఆలయాలను కూల్చివేసిన ప్రాంతాలకు మంత్రులను పంపి వారితో కూల్చిన ఆలయాలను పునర్నిర్మించే చర్యలు చేపడతామని చెప్పించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Row over demolition of temples in vijayawada. Hindu dharma pariraksha samiti members going to strike on august 1.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి