అంతా చూస్తుండగానే రౌడీషీటర్ దారుణ హత్య: నిమిషంలోనే 40కత్తిపోట్లు(వీడియో)

Subscribe to Oneindia Telugu
  రౌడీషీటర్ వాసు మర్డర్ వీడియో | Oneindia Telugu

  గుంటూరు: నగరంలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. బసవల వాసు (38)అనే మాజీ రౌడీషీటర్‌‌ను దుండగులుకత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. నిత్యం రద్దీగా ఉండే అరండల్‌పేట 12వ వీధిలోని ఓ రెస్టారెంట్‌ ముందు జరిగిన ఈ హత్య నగరంలో కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

   విచక్షణా రహితంగా కత్తిపోట్లు..

  విచక్షణా రహితంగా కత్తిపోట్లు..

  ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం రాత్రి సుమారు 8.30 గంటల ప్రాంతంలో బసవల వాసు.. స్థానిక రెస్టారెంట్‌లో భోజనం చేసి మరో వ్యక్తితో కలిసి బయటకు వచ్చి నిల్చున్నాడు. అంతలో ఓ స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు వాసును తమ వాహనంతో ఢీకొట్టారు. ఆయన అక్కడే కిందపడిపోయాడు. వెంటనే వాహనంలో నుంచి దిగిన ఐదుగురు దుండగులు కత్తులు, వేటకొడవళ్లు, కత్తులతో విచక్షణారహితంగా నరికి చంపారు.

  నిమిషంలోనే 40కిపైగా కత్తిపోట్లు..

  నిమిషంలోనే 40కిపైగా కత్తిపోట్లు..

  కేవలం నిమిషంలోనే సుమారు 40కిపైగా కత్తిపోట్లు పొడిచారు. అతను బతికి ఉన్నాడనే అనుమానంతో నిందితుల్లో ఒకరు మృతుడి పీకను కోశాడు. వెంటనే వచ్చిన వాహనంలోనే పరారయ్యారు దుండగులు. కొందరు ముఖాలకు టోపీలు ధరించగా, మరికొందరు గుడ్డలు కట్టుకున్నారు.

  మాజీ ఎమ్మెల్యే అనుచరుడే కానీ..

  మాజీ ఎమ్మెల్యే అనుచరుడే కానీ..

  కాగా, విద్యానగర్‌కు చెందిన మృతుడు వాసు కాంగ్రెస్‌ పార్టీ హయాంలో నగరానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడుగా ఉండేవాడు. పాతగుంటూరులో ఇతను సోదరుడు వీరయ్యను 2004లో హత్య చేశారు. 2005లో తన సోదరుడిని చంపిన వారిని హత్య చేసిన కేసులో వాసు ముద్దాయిగా ఉన్నారు. అప్పట్లో అతనిపై పోలీసులు రౌడీషీట్‌ నమోదు చేశారు. కొంతకాలం తర్వాత మాజీ ఎమ్మెల్యే వద్ద ఓ సెటిల్‌మెంట్ల వ్యవహారంలో ఒక వ్యక్తి మృతి చెందిన కేసులో వాసుకు జైలుశిక్ష విధించగా ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చినట్లు తెలిసింది.

  సీసీ ఫుటేజీలో స్పష్టంగా..

  కాగా, ఈ హత్యకు సంబంధించి అర్బన్‌ ఎస్పీ విజయరావు స్వయంగా విచారణ చేపట్టారు.ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం అదుపులోకి తీసుకున్న అనుమానితులను ఆయన విచారిస్తున్నారు. హత్య జరిగిన రెస్టారెంట్‌ వద్ద సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు సేకరించారు. మరో వ్యక్తితో కలిసి రెస్టారెంట్‌కు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో ఉంది. ఆ వ్యక్తి ఎవరనేది కూడా తెలియాల్సి ఉంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Rowdy sheeter Basavala Vasu murdered in guntur town on Sunday night.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి