Borugadda Anil: ఎట్టకేలకు నోరు విప్పిన బోరుగడ్డ అనిల్- వాళ్తు చెప్తేనే ! అది గుర్తులేదు..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూటమి పార్టీల నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వ్యవహారంలో వరుస కేసులు ఎదుర్కొంటున్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఎట్టకేలకు నోరు విప్పాడు. అనంతపురంలో నమోదైన ఓ కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బోరుగడ్డను కస్టడీలోకి తీసుకుని రెండు రోజుల పాటు విచారించారు. ఇందులో తొలి రోజు నోరు విప్పని బోరుగడ్డ.. రెండో రోజు మాత్రం కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

అప్పట్లో వైసీపీ అధిష్ఠానం ఒత్తిడి వల్లే సోషల్‌ మీడియాలో అశ్లీల పోస్టులు పెట్టాల్సి వచ్చిందని ఆ పార్టీ నాయకుడు, రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కుమార్‌ పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి శనివారం ఆయన్ను కస్టడీకి తీసుకున్న అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు...ఆదివారం అర్ధరాత్రికి నగరానికి తీసుకొచ్చారు. అనంతరం గత ప్రభుత్వ హయాంలో ఆయన సోషల్ మీడియా పోస్టులపై సమగ్రంగా విచారించారు. తొలిరోజు తనకేమీ తెలియదని చెప్పిన బోరుగడ్డ సోమవారం మాత్రం కొన్ని విషయాలు వెల్లడించాడు.

rowdy sheeter Borugadda Anil reveals who is behind his social posts in police custody

డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు చంద్రబాబు, లోకేశ్‌, వారి కుటుంబ సభ్యులను దూషించిన వీడియోల ఆధారంగా బోరుగడ్డ అనిల్ ను విచారించారు. పోలీసులు పదే పదే ప్రశ్నలు సంధించడంతో తాను వైసీపీ హైకమాండ్‌ ఆదేశాల మేరకే సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టానని చెప్పినట్లు తెలుస్తోంది.

అసలు ఆ వీడియాలు చేయమని చెప్పిన వ్యక్తి ఎవరన్న ప్రశ్నకు మాత్రం ఆ విషయం గుర్తులేదని చెప్పినట్లు తెలిసింది. మరికొన్ని ప్రశ్నలకు కూడా మౌనంగా ఉండిపోయాడు. దీంతో బోరుగడ్డ కస్టడీ సమయం ముగుస్తుండటంతో సీఐ సాయినాథ్‌, ఎస్‌ఐ రాంప్రసాద్‌ సాయంత్రం 4.30గంటలకు కోర్టులో హాజరు పరిచారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+