Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ సర్కార్ మరో కరెంటు షాక్-సర్దుబాటు పేరుతో రూ.4 వేల కోట్లు- వచ్చే 8 నెలలు బిల్లుల మోత

ఏపీలో ఎన్నికల హామీ మేరకు కరెంటు ఛార్జీల పెంపు ఉండబోదని భావిస్తున్న వినియోగదారులకు ఇప్పటికే ఏసారి షాకిచ్చిన జగన్ సర్కార్ ఇప్పుడు మరో షాకిచ్చేందుకు సిద్ధమైంది. ఎప్పుడో 2014 నుంచి 2019 మధ్య అంటే తమ ప్రభుత్వం రాకముందే విద్యుత్ సంస్ధలు నష్టపోయిన మొత్తాల్ని ఇప్పుడు వినియోగదారుల్ని అదనపు ఛార్జీల రూపంలో రాబట్టాలని నిర్ణయించింది. దీంతో వచ్చే 8 నెలల పాటు ఏపీలో కరెంటు బిల్లుల మోత మోగబోతోంది. అదీ డిస్కంల వారీగా బిల్లుల మోతలో తేడాలు కూడా ఉండబోతున్నాయి. దీంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

 జగన్ సర్కార్ మరో కరెంటు షాక్

జగన్ సర్కార్ మరో కరెంటు షాక్

ఏపీలో విద్యుత్ వినియోగదారులకు జగన్ సర్కార్ మరో భారీ షాకివ్వబోతోంది. వచ్చే నెల బిల్లుల నుంచి వినియోగదారులకు ఈ షాక్ తగలబోతోంది. ఎన్నికల హామీ మేరకు కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు మరో రూపంలో ప్రజల ముక్కుపిండి వసూళ్లు చేసేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఇప్పటికే కరోనా కష్టాలతో పాటు ఆస్తిపన్ను, చెత్తపన్ను పేరుతో తగులుతున్న ఒక్కో షాక్ కు ఇది అదనం కానుంది. ఈ మేరకు డిస్కంలు చేసిన ప్రతిపాదనలకు ఏపీఈఆర్సీ ఆమోదం తెలపడంతో వెంటనే నిర్ణయం అమల్లోకి రాబోతోంది.

 సర్దుబాటు పేరుతో బిల్లుల మోత

సర్దుబాటు పేరుతో బిల్లుల మోత

ఏపీలో ప్రస్తుతం పంపుతున్న కరెంటు బిల్లుల్లో సర్దుబాటు ఛార్జీల పేరుతో ఈ మోత మోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే నెల నుంచి వరుసగా 8 నెలల పాటు ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీల పేరుతో కరెంటెు బిల్లుల్లో ఈ మోత మోగబోతోంది. ఇప్పటివరకూ తాము వాడుతున్న బిల్లుల మొత్తాన్నే చెల్లించే వినియోగదారులు సెప్టెంబర్ నుంచి తాము వాడని మొత్తాన్ని సైతం అదనపు ఛార్జీ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు సహజంగానే కరెంటు బిల్లులు పెరగడం ఖాయం. దీంతో వినియోగదారుల్లో ఇప్పటి నుంచే ఆందోళన మొదలైంది.

పాత నష్టాలకు కొత్త సర్దుబాటు

పాత నష్టాలకు కొత్త సర్దుబాటు

2014-15 ఆర్ధిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్ధిక సంవత్సరం వరకూ అంటే ఆ ఐదేళ్ల పాటు విద్యుత్ ఉత్పత్తికి అయిన ఖర్చు, సరఫరాకు అయిన ఖర్చుకూ మధ్య ఉండే వ్యత్యాసాన్ని నష్టాల రూపంలో ప్రజలపై రుద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి పెట్టిన పేరు ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీలు. అంటే అప్పుడు తలెత్తిన నష్టాల్ని ఇప్పుడు వాడకం ఆధారంగా వినియోగదారుల నుంచి సర్దుబాటు రూపంలో వసూలు చేస్తారన్న మాట. దీంతో పాత నష్టాలకు కొత్త ఛార్జీల వడ్డనకు డిస్కంలు రంగం సిద్ధం చేస్తున్నాయి. గతంలో జరిగిన నష్టాన్ని 10 శాతానికి పైగా వడ్డీతో కలిపి మరీ డిస్కంలు వినియోగదారులకు వడ్డించబోతున్నాయి.

 రెండు డిస్కంల పరిధిలో వేర్వేరు ఛార్జీలు

రెండు డిస్కంల పరిధిలో వేర్వేరు ఛార్జీలు

ప్రస్తుతం రాష్ట్రంలో దక్షిణ ప్రాంత విద్యుత్ సరఫరా సంస్ధ(ఎస్పీడీసీఎల్), తూర్పు ప్రాంత విద్యుత్ సరఫరా సంస్ధ (ఈపీడీసీఎల్) ఉన్నాయి. ఈ రెండు డిస్కంల పరిధిలో రెండు వేర్వేలు ఛార్జీలు విధించడం వినియోగదారులకు మరో షాక్ గా మారబోతోంది. ఎస్పీడీసీఎల్ పరిధిలో యూనిట్ కు రూ.1.27 చొప్పిన, ఈపీడీసీఎల్ పరిధిలో అయితే యూనిట్ కు రూ.0.45 చొప్పున అదనపు ఛార్జీలు విధించబోతున్నారు. అంటే గతంలో ఆయా విద్యుత్ పంపిణీ సంస్ధలు చవిచూసిన నష్టాల ఆధారంగా ఈ ఛార్జీల లెక్కింపు చేపడుతున్నారు. దీంతో ఆయా డిస్కంల పరిధిలో ఉన్న వినియోగదారులకు వీటి ఆధారంగానే అదనపు ఛార్జీలు పడతాయి.

 సగం షాక్ కే అనుమచ్చిన ఈఆర్సీ

సగం షాక్ కే అనుమచ్చిన ఈఆర్సీ

వాస్తవానికి ఏపీలో డిస్కంలు గతంలో ఐదేళ్ల పాటు తమకు కలిగిన నష్టాన్ని సర్దుబాటు చేసుకునేందుకు ప్రతిపాదించిన అదనపు ఛార్జీలు రూ.7200 కోట్లు. కానీ ఈఆర్సీ మాత్రం రూ.3600 కోట్ల వసూళ్లకు మాత్రమే అనుమతిచ్చింది అంటే మొత్తం ఛార్జీలు ఇప్పుడే వసూలు చేయబోరన్న మాట. మొత్తం ఛార్జీలు ఒకేసారి వసూలు చేయడం మొదలుపెడితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదు కాబట్టి ఇప్పుడు సగం ఛార్జీలు మాత్రమే వసూలు చేసి ఆ తర్వాత మిగతా ఛార్జీలు మరోసారి వడ్డిస్తారు. దీంతో రాబోయే రోజుల్లో ఈ మరో సగం ఛార్జీల వడ్డన తప్పదని తేలిపోయింది.

 బిల్లుల్లో పెరుగుదల ఇలా

బిల్లుల్లో పెరుగుదల ఇలా

ప్రస్తుతం ఈఆర్సీ ఆమోదించిన ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీలు సెప్టెంబర్ నెల నుంచి అమల్లోకి రానున్నాయి. అప్పటి నుంచి 8 నెలల పాటు వీటి వడ్డన ఉంటుంది. ఇందులో ప్రస్తుతం 200 యూనిట్లు వాడుతున్న ఎస్పీడీసీఎల్ పరిధిలోని వినియోగదారుడు కొత్త బిల్లుల్లో దాదాపు రూ.250 మేర అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈపీడీసీఎల్ పరిధిలోని వినియోగదారులపై అయితే రూ.90 మేర అదనపు ఛార్జీల భారం పడుతుంది. ఈ లెక్కన వచ్చే 8 నెలల్లో రూ.3600 కోట్ల రూపాయల భారం వినియోగదారులపై మోపేందుకు విద్యుత్ సంస్ధలు సిద్ధమయ్యాయి.

Recommended Video

    5.1 తీవ్రతతో Earthquake.. AP, Tamil Nadu లోని పలు ప్రాంతాల్లో కంపించిన భూమి..! || Oneindia Telugu
     ట్రూఅప్ విధానంతో జీవితకాల భారం

    ట్రూఅప్ విధానంతో జీవితకాల భారం

    ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ట్రూఅప్ ఛార్జీల విధానం వల్ల విద్యుత్ వినియోగదారులపై జీవితకాల భారం తప్పేలా లేదు. ఎందుకంటే విద్యుత్ ఉత్పత్తికీ, పంపిణీకీ అయ్యే ఖర్చుకు మధ్య ఏటా వచ్చే వ్యత్యాసాలను ప్రతీ ఏటా లెక్కించి ఆ తర్వాత సంవత్సరంలో సర్దుబాటు ఛార్జీల రూపంలో ప్రజలపై భారం వేస్తున్నారు. ఇందులో సరఫరా నష్టాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సరఫరా నష్టాలను తగ్గించుకోవడం ద్వారా విద్యుత్ పంపిణీ, సరఫరా ఖర్చుల్లో వ్యత్యాసాన్ని తగ్గించి ప్రజలపై భారం లేకుండా చూసే అవకాశం ఉన్నా.. ఆ మేరకు డిస్కంలు ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో ప్రతీ ఏటా విద్యుత్ సంస్ధలు చవిచూస్తున్న నష్టాలను వడ్డీలతో సహా ప్రజలపై మోపి చేతులు దులుపుకుంటున్నాయి దీంతో అంతిమంగా నష్టపోతోంది వినియోగదారులే. విద్యుత్ పంపిణీ సంస్ధల నష్టాలు ఒట్టిమాటే అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+