ఆంధ్రప్రదేశ్‌కు రూ.500 కోట్ల రుణం: జర్మనీతో భారత్ ఒప్పందం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడుతున్న హరిత ఇంధన ప్రాజెక్టులకు సుమారు రూ.500 కోట్లు రుణం లభించనుంది. ఈ మేరకు భారత్, జర్మనీలు సోమవారం ఢిల్లీలో రుణ ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
మొత్తం ఒప్పందం విలువ 12.5 కోట్ల యూరోలు (సుమారు రూ.912.50 కోట్లు) కాగా, ఇందులో హిమాచల్‌ప్రదేశ్‌కు 5.70 కోట్ల యూరోలు (రూ.416 కోట్లు) ఇస్తారు. మిగిలిన మొత్తం ఆంధ్రప్రదేశ్‌కు దక్కుతుంది.

ఏపీ తరఫున ఏపీ ట్రాన్స్‌కో డైరెక్టర్ (ఆర్థిక విభాగం) పి సత్యమూర్తి సంతకాలు చేశారు. కాగా, ఈ రుణాన్ని పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కేంద్ర, రాష్ట్ర గ్రిడ్‌లకు అనుసంధానం చేయడానికి వినియోగిస్తారు.
శ్రీశైలం మల్లన్న సేవలో ఏపీ ఉప ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బుధవారం ఉదయం శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఉపముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications