ఏపీలో ఆర్టీసీ జనతా గ్యారేజ్ లు: మూడు దశల్లో 12డిపోల్లో.. ఆదాయమే లక్ష్యం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ ఆదాయ వనరులను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో భాగంగా జనతా గ్యారేజ్ విధానానికి ఆర్టీసీ రూపకల్పన చేసింది. ఇక ఈ విధానంలో ఆర్టీసీ తో పాటుగా ప్రైవేటు వాహనాలకు కూడా సర్వీసింగ్ సేవలను అందించడానికి ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి ఉన్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఆర్ధికంగా స్వయం సమృద్ది సాధించడం కోసం ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏపీఎస్ ఆర్టీసీ జనతా గ్యారేజ్... ప్రైవేట్ మార్కెట్ లోనూ ఆర్టీసీ సర్వీసింగ్ సేవలు
రాష్ట్రంలో దాదాపు ఒక కోటి 50 లక్షల వాహనాలు ఉండగా, వాటిలో 17లక్షల వరకు ప్రైవేట్ వాణిజ్య వాహనాలు ఉన్నాయి. వాటి యజమానులు ప్రస్తుతం వాటిని ప్రైవేట్ సర్వీసింగ్ సెంటర్ లలో సర్వీసింగ్ చేయిస్తున్నారు. దీంతో జనతా గ్యారేజ్ లను ప్రవేశపెట్టి ఆర్టీసీ సర్వీసింగ్ మార్కెట్ లోకి ప్రవేశించాలని నిర్ణయం తీసుకుంది. ఆదాయాన్ని పెంచుకోవటం కోసం నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనల మేరకు ఆర్టీసీ కార్యాచరణను మొదలు పెట్టబోతుంది. ఇందులో భాగంగా మొత్తం ఈ జనతాగ్యారేజ్ విధానాన్ని మూడు దశల్లో 12 డిపోల్లో ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

తొలిదశలో జనతా గ్యారేజ్ లు ఇక్కడే
మొదటి దశలో విజయనగరం, నెల్లూరు, కడప ,విజయవాడలలో ప్రైవేట్ వాహనాలకు సర్వీసింగ్ సేవలను అందిస్తారు. ఇప్పటికే ఈ డిపోలలో ఆర్టీసీకి బస్సు టైర్ల రీ ట్రేడింగ్ యూనిట్లు ఉన్నాయి. దీంతో వాహనాల టైర్లు కూడా రీ ట్రేడ్ చేసే సేవలను ప్రవేశపెడతారు. వాహనాలకు సంబంధించిన అన్ని సర్వీసింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చి తద్వారా ఆదాయవనరులు పెంచడానికి ఆర్టీసీ ప్రయత్నాలు సాగిస్తుంది. జనతా గ్యారేజ్ ల ద్వారా ఆర్టీసీ అందించే సేవలకు ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా కూడా సిబ్బందిని నియమించాలని ఆర్టీసీ భావిస్తోంది.

మొత్తం 12 డిపోలలో ఆర్టీసీ జనతా గ్యారేజ్ లు
తొలిదశలో భారీ వాహనాలకు సర్వీసింగ్ అందించి, అనంతరం కార్లు, ఎస్ యు వి లు, ఇతర వాహనాలకు సర్వీసింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. మొదటిదశలో ప్రయోగం సక్సెస్ అయితే, రెండవ దశలో విశాఖ, కాకినాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి డిపోలలో, మూడవ దశలో కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం డిపోలలో జనతా గ్యారేజ్ విధానాన్ని ప్రవేశ పెడతారు. మొత్తం మూడు నెలల్లో జనతా గ్యారేజ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి ప్రైవేటు వాహనాలు కూడా సర్వీసింగ్ సేవలందించడానికి ఆర్టీసీ రంగంలోకి దిగనుంది.

జనతా గ్యారేజ్ పేరుతో ఆర్టీసీ సేవలలో సక్సెస్ అవుతుందా?
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచడంపై ఫుల్ గా ఫోకస్ పెట్టారు. అనేక వినూత్న నిర్ణయాలు తీసుకొని ఆర్టీసీ ఆదాయాన్ని పెంచడానికి, ఆర్టీసీపై ప్రజల ఆదరణ పెరగడానికి సజ్జనార్ ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచడానికి సరికొత్త ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఆర్టీసీ స్థలాలలో షాపింగ్ కాంప్లెక్స్ లు కట్టి వాటి ద్వారా కూడా ఆదాయాన్ని ఆర్జించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పుడు జనతా గ్యారేజ్ లతో ప్రజల్లోకి వెళ్తున్నారు. జనతా గ్యారేజ్ పేరుతో ఆర్టీసీ సేవల విషయంలో మరి ఈ ప్రయత్నాలలో ఆర్టిసి ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications