ఏబీ వెంకటేశ్వర రావు ఊహించని నిర్ణయం..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ లక్ష్యంగా కూటమి పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. వైసీపీ నేతలు కూటమి లక్ష్యంగా పోరుబాటకు సిద్దమైంది. ఇదే సమయంలో బీజేపీ సైతం ఏపీ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అనూహ్య నిర్ణయాల దిశగా అడుగు లు వేస్తోంది. ఇక, ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాల వేళ అనూహ్యంగా రిటైర్డ్ పోలీసు అధికారి ఏబీ వేంకటేశ్వర రావు రాజకీయ ఎంట్రీకి సిద్దమయ్యారు. ఆయనకు ఇప్పటికే రాజకీయం కీలక హామీ దక్కినట్లు ప్రచారం సాగుతోంది.

రాజకీయ ప్రవేశం
ఏబీ వెంకటేశ్వర రావు. సీనియర్ ఐపీఎస్ అధికారిగా పదవీ విరమణ చేసారు. జగన్ హయాంలో పోస్టింగ్ లేకుండా దూరంగా ఉన్నారు. 2014 లో చంద్రబాబు సీఎం అయిన తరువాత నాడు తొలుత అనూరాధను నిఘా చీఫ్ గా నియమించారు. ఆనురాధ తరువాత ఏబీ వేంకటేశ్వర రావు ఇంటలిజెన్స్ చీఫ్ గా 2019 ఎన్నికల వరకు వ్యవహరించారు. ఇక.. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఏబీ వెంకటేశ్వర రావు పైన విచారణలు..సస్పెన్షన్లు కొనసాగించారు. ఏబీ సైతం న్యాయ స్థానం ద్వారా తన పోరాటం సాగించారు. వైసీపీ హయాంలో నాలుగేళ్ల పాటు సస్పెన్షన్ లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరించారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం ఆయనకు నామినేటెడ్ పదవి కట్టబెట్టింది.

rtd-ips-ab-venkateswara-rao-to-announce-his-political-entry-as-reports

ఏ పార్టీలో చేరుతారు
ఏబీకి ఇచ్చిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యా . ఆయనకు ఆ పదవి సరి కాదనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఇప్పటి వరకు ఆయన తనకు కేటా యించిన పదవి బాధ్యతలు స్వీకరించలేదు. టీడీపీ అధినాయకత్వం నిర్ణయం పైన కేడర్ సైతం ఏబీ విషయంలో ఇచ్చిన పదవి పైన విభేదించింది. కాగా, ఇప్పుడు ఏబీ వెంకటేశ్వర రావు తాజాగా పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం చేసుకున్నారు. జగన్ పైన కొంత కాలంగా ఆయన చేస్తున్న కామెంట్స్ సంచలనంగా మారాయి. టీడీపీ అధినాయకత్వంతో ఏబీ వెంకటేశ్వర రావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. అయితే.. ఇప్పుడు ఏబీవీ టీడీపీలో చేరటం లేదనే చర్చ జరుగుతోంది.

Take a Poll

టీడీపీలోకి వెళ్లరా..!
ఏబీ వెంకటేశ్వర రావు రాజకీయంగా ఎంట్రీ ఇస్తారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. కాగా, ఆయనకు జగన్ పైన అయిదేళ్లు పోరాటం చేసినా.. తగిన గుర్తింపు దక్కేలా కూటమి నేతలు వ్యవ హరించలేదనే అభిప్రాయం ఉంది. దీంతో.. ఏబీ వెంకటేశ్వర రావు బీజేపీ వైపు చూస్తున్నట్లు తాజా గా ప్రచారం సాగుతోంది. అయితే, టీడీపీలోని ముఖ్యలు మాత్రం ఆయన రాజకీయంగా టీడీపీలో చేరాలని నిర్ణయిస్తే.. ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. టీడీపీలోకి వెళ్లేందుకు ఏబీ వెంకటేశ్వర రావు సిద్దపడకపోతే.. బీజేపీ ఆయనకు ప్రత్యామ్నాయంగా ఉందనే చర్చ సాగుతోంది. దీంతో, ఏబీ పొలిటికల్ ఎంట్రీ ఖాయమని జరుగుతున్న ప్రచారం వేళ, ఏ పార్టీలో చేరుతారు.. రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+