Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతుబంధు నిధుల జమపై కీలక అప్డేట్..!!

రైతుబంధు సాయం నిధులు పూర్తి స్థాయిలో జమ కావటానికి మరింత సమయం తప్పేలా లేదు. ఇప్పటికే ఈ నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మొత్తం 70 లక్షల మంది రైతులకు నిధులు ఇవ్వాల్సి ఉంది. తాజా లెక్కల ప్రకారం 30 లక్షల మంది రైతులకు అందినట్లు తెలుస్తోంది. దీని ద్వారా మిగిలిన వారికి ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా..మరి కొంత సమయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

రైతుబంధుకు ప్రాధాన్యత : ఎన్నికల సమయంలోనే రైతుబంధు నిధుల గురించి చర్చ జరిగింది. ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వటం..ఆ తరువాత రద్దు చేయటం రాజకీయంగా చర్చకు కారణమైంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే రైతుబంధు విడుదల చేస్తామని నాడు కాంగ్రెస్ ముఖ్య నేతలు హామీ ఇచ్చారు. డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పాటు అయింది. డిసెంబర్‌ 9న రైతుబంధు పంపిణీని సీఎం అట్టహాసంగా ప్రారంభించారు. ఆ తరువాత దశల వారీగా నిధులు విడుదల చేస్తోంది. జనవరి తొలి వారంలో ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలు, ఇతర అవసరాల కోసం మధ్యలో రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తరువాత తిరిగి అందుబాటులో ఉన్న నిధుల మేరకు విడుదల చేస్తున్నారు.

Rythubandhu funds seem to be delayed for some more time, see deets

70 లక్షల మంది రైతులకు : రైతుబంధు సాయం కింద సుమారు 70 లక్షల మంది రైతులకు రూ. 7,600 కోట్లు జమ చేయాల్సి ఉంది. ఈ నెల రోజుల్లో ప్రభుత్వం ఎకరంన్నర వరకు భూమి గల రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం జమ చేసింది. ఇప్పటి వరకు మొత్తం 30 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం జమ చేసినట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మొన్నటి వానకాలం లెక్కల ప్రకారం రెండెకరాలున్న రైతులే 40 లక్షల మంది వరకు ఉన్నారు. వీరికి గత సీజన్‌లో సుమారు రూ. 2వేల కోట్లు పంపిణీ చేశారు. ఇందులో ఎకరం రైతులు 22.55 లక్షలమంది ఉండగా వీరికి రూ. 642 కోట్లు జమ చేసింది. ఈ లెక్కన చూసుకుంటే ప్రభుత్వం ఇప్పటి వరకు 30 లక్షల మంది రైతులకు రూ. 1000 కోట్ల లోపే పెట్టుబడి సాయం పంపిణీ చేసినట్లు చెబుతున్నారు.

Rythubandhu funds seem to be delayed for some more time, see deets

పూర్తయ్యేది ఎన్నడు : గత వానకాలం సీజన్‌లో నాటి ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకు రూ. 7,624 కోట్లను పెట్టుబడి సాయం కింద వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ లెక్కను పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంకా 40 లక్షల మంది రైతులకు సుమారు రూ. 6,600 కోట్లు పంపిణీ చేయాల్సింది ఉంది. ఆర్దికంగా ఉన్న సమస్యలను అధిగమిస్తూ రైతుబంధు నిధుల జమకు ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో రైతుబంధు జమ అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఆర్దికంగా ఉన్న ఇబ్బందులను అధిగమించి రైతుబంధును పూర్తి చేయాలంటే మరింత సమయం తప్పేలా లేదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+