శబరిమలలో అరుదైన ఘట్టం- దర్శనాలపై టీడీబీ కీలక ప్రకటన..!!
లక్షలాది మంది అయ్యప్ప భక్తుల సమక్షంలో శబరిమల లో కీలక ఘట్టం చోటు చేసుకుంటోంది. శబరిమల ఆలయంలో ఈ రోజు జరిగే మండల పూజకు సర్వం సిద్దమైంది. అయ్యన్న నామ స్మరణ తో శబరిగిరి ప్రతిధ్వనిస్తోంది. పూజా కార్యక్రమాలు పూర్తయిన తరువాత ఈ రాత్రికి ఆలయ తలుపులు మూసివేయనున్నారు. మకర విళక్కు సీజన్ సందర్భంగా ఈ నెల 30న సాయంత్రం 5 గంటలకు అయ్యప్ప స్వామి సన్నిధానాన్ని తిరిగి తెరుస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు.
శబరిమలలో మండల పూజోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమయంలో ఆలయ అధి కారులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. వర్చువల్ బుకింగ్‌లో 50 వేల మంది.. స్పాట్ బుకింగ్‌లో 5 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం కల్పిస్తామని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) వెల్లడించింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మండల పూజోత్సవం ప్రారంభం కానుంది. ఆ తర్వాత నెయ్యాభిషేకం జరిపి.. దర్శనానికి అనుమతిస్తామని, రాత్రి 11 గంటలకు 'హరివరాసనం'తో ఆలయం తలుపులను మూసివేస్తామని వెల్లడించారు.

ఇక, మకర విళక్కు సీజన్ సందర్భంగా ఈ నెల 30న సాయంత్రం 5 గంటలకు అయ్యప్ప స్వామి సన్నిధానాన్ని తిరిగి తెరుస్తామని చెప్పారు. జనవరి 14న మకర విళక్కు పూజలు నిర్వహించను న్నారు. 18వ తేదీ వరకు ఆలయం తెరిచి ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు.
కాగా.. ఆదివారం అరన్ముల పార్థసారథి ఆలయం నుంచి బయలుదేరిన 'తంగ అంకి'(వస్త్రాలంకరణ) ఊరేగింపు బుధవారం మధ్యాహ్నం పంపాబేస్ కు.. సాయంత్రం సన్నిధానానికి చేరుకుంది. మండల పూజ వేళ భారీగా అయ్యప్ప భక్తులు శబరిమలకు చేరుకున్నారు. రద్దీని పరిగణలోకి తీసుకున్న ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇక, శబరిమలకు తెలంగాణ నుంచి వెళ్లిన 11 మంది భక్తులు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications