సబ్బం హరి మృతి టీడీపీకి తీరని లోటు.. లోకేష్,అచ్చెన్నలతో పాటు టీడీపీ నాయకుల దిగ్భ్రాంతి

మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సబ్బం హరి కన్నుమూశారు. కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన,గత కొద్ది రోజులుగా విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.తాజాగా ఆయన పరిస్థితి విషమించడంతో ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. సబ్బం హరి మృతి పట్ల టిడిపి నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే చంద్రబాబు సబ్బంహరి మృతి టీడీపీకి తీరని లోటని , జీర్ణించుకోలేని విషాదం అని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు, నారా లోకేష్, దేవినేని ఉమాలతో పాటు పలువురు టీడీపీ నాయకులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.

సబ్బం హరి కరోనాతో మృతి చెందడం బాధాకరం : అచ్చెన్నాయుడు

సబ్బం హరి కరోనాతో మృతి చెందడం బాధాకరం : అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సబ్బం హరి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి సబ్బంహరి మృతి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. సబ్బంహరి కరోనాతో మృతి చెందడం బాధాకరమని పేర్కొన్న అచ్చెన్నాయుడు, విశాఖ మేయర్ గా, ఎంపీగా సబ్బం హరి ప్రజలకు ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు. సబ్బం హరి మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అచ్చెన్నాయుడు.

 ఆయన లాంటి నేతను కోల్పోవడం నిజంగా దురదృష్టకరం: లోకేష్

ఆయన లాంటి నేతను కోల్పోవడం నిజంగా దురదృష్టకరం: లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం తెలుగుదేశం సీనియర్ నాయకులు సబ్బం హరి గారు ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ ట్వీట్ చేశారు. తన నిస్వార్థ రాజకీయాలతో మాలాంటివారికి మార్గదర్శిగా నిలిచారు సబ్బం హరి గారు అంటూ నారా లోకేష్ పేర్కొన్నారు. అంతేకాదు ఆయన లాంటి నేతను కోల్పోవడం నిజంగా దురదృష్టకరం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అంటూ లోకేష్ పేర్కొన్నారు.

సబ్బం హరి గారి మృతి చాలా విచారకరం :దేవినేని ఉమా

సబ్బం హరి గారి మృతి చాలా విచారకరం :దేవినేని ఉమా

ఇదే సమయంలో ఏ విషయంపైన అయినా తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పే సబ్బంహరి గారు ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేశారని సబ్బం హరి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. సబ్బం హరి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని పేర్కొన్నారు.దేవినేని ఉమా సైతం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సీనియర్ నాయకులు అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి గారి మృతి చాలా విచారకరం ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్వీట్ చేశారు.

మంచి మిత్రుడిని కోల్పోయానన్న బుద్ధా వెంకన్న, పోరాటయోధుడు అన్న నిమ్మల రామానాయుడు

మంచి మిత్రుడిని కోల్పోయానన్న బుద్ధా వెంకన్న, పోరాటయోధుడు అన్న నిమ్మల రామానాయుడు

మాజీ ఎంపీ సబ్బంహరి గారి మృతి బాధాకరం.మంచి మిత్రుడ్ని కోల్పోయాను. విశాఖ అభివృద్ధి కోసం సబ్బంహరి గారు ఎంతగానో కృషి చేసారు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు. ఇక టీడీపీ నాయకుడు నిమ్మల రామానాయుడు విలువలతో కూడిన రాజకీయాలను చేసిన శ్రీ సబ్బం హరి గారు ఇక లేకపోవడం చాలా బాధాకరం. ఒక పోరాట యోధుడిని ,రాజకీయ విజ్ఞానవేత్తని కోల్పోవడం పార్టికి తీరని లోటు. ఆయన స్మ్నతికి నివాళులు ఆర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+