• search
  • Live TV
కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

భీమిలి నుండి స‌బ్బంహరి : క‌ర్నూలు బ‌రిలో టిజి భ‌ర‌త్ : రాధాకు ద‌క్క‌ని సీటు : వైసిపి టార్గెట్ ఫిక్స్

|

ఏపిలో పోటీ చేసే అభ్య‌ర్దుల తుది జాబితాను టిడిపి విడుద‌ల చేసింది. కొద్ది రోజులుగా కొన్ని స్థానాల కోసం తీవ్ర పోటీ నెల‌కొని ఉంది. ఆ స్థానాల విష‌యంలో టిడిపి ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసింది. మంత్రి గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజ‌క‌వ‌ర్గం లో ఈ సారి అనూహ్యంగా స‌బ్బం హ‌రి కి కేటాయించారు. టిజి వ‌ర్సెస్ ఎస్వీ గా మారిన క‌ర్నూలు సీటును టిజి వెంక‌టేష్ త‌న‌యుడు భ‌ర‌త్ కు కేటాయించారు. ఇక‌, టిడిపిలో చేరిన వంగ‌వీటి రాధాకు మాత్ర ఎక్క‌డా సీటు కేటాయించ‌లేదు.

గాజువాక నుండి ప‌వ‌న్ : 1 లోక్‌స‌భ‌..13 అసెంబ్లీ స్థానాల‌కు : జ‌న‌సేన జాబితా విడుద‌ల‌..!

స‌బ్బం హ‌రికి ఎమ్మెల్యే సీటు...

స‌బ్బం హ‌రికి ఎమ్మెల్యే సీటు...

మాజీ ఎంపి స‌బ్బం హ‌రికి టిడిపి అసెంబ్లీ సీటు కేటాయించింది.అన‌కాప‌ల్లి నుండి కాంగ్రెస్ ఎంపీగా వ్య‌వ‌హ‌రించిన స‌బ్బం హ‌రి 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసిపి నుండి బ‌య‌ట‌కు వ‌చ్చారు. స‌రిగ్గా పోలింగ్ ముందు రోజు టిడిపికి మ‌ద్ద తుగా..వైసిపికి వ్య‌తిరేకంగా మీడియా స‌మావేశం పెట్టి విమ‌ర్శ‌లు చేసారు. ఆ త‌రువాత రాజ‌కీయాల్లో టిడిపికి మ‌ద్ద‌తుగా మాట్లాడుతున్నా..అధికారికంగా టిడిపిలో చేర‌లేదు. అయితే, ఈ ఎన్నిక‌ల్లో స‌బ్బం హ‌రి టిడిపి నుండి పోటీ చేస్తార‌నే అంచ‌నాలు ఉన్నా..ఎంపీగా పోటీ చేస్తార‌ని భావించారు. ఇప్పుడు స‌డ‌న్ గా భీమిలి సీటుకు ఎంపిక చేసారు. భీమిలి నుండి వైసిపి అభ్య‌ర్దిగా అవంతి శ్రీనివాస రావు బ‌రిలో ఉన్నారు. జ‌న‌సేన ఇంకా అభ్య‌ర్దిని ఖ‌రారు చేయ‌లేదు. స‌బ్బం హ‌రి పై రాజ‌కీయంగా పై చేయి సాధించాల‌నే ల‌క్ష్యంతో వైసిపి ఉంది .

క‌ర్నూలు బ‌రిలో టిజి త‌న‌యుడు..

క‌ర్నూలు బ‌రిలో టిజి త‌న‌యుడు..

క‌ర్నూలు అసెంబ్లీ స్థానం పైనా కొంత కాలంగా స‌స్పెన్స్ నెల‌కొని ఉంది. అక్క‌డ 2014 లో వైసిపి నుండి గెలిచి టిడిపి లోకి ఫిరాయించిన ఎస్వీ మోహ‌న రెడ్డి తిరిగి సీటు ఆశించారు. అయితే, రాజ్య‌స‌భ స‌భ్యుడు టిజి వెంక‌టేష్ త‌న‌యుడు భర‌త్ కు సీటు ఇవ్వాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నం చేసారు. అయితే, లోకేష్ క‌ర్నూలు ప‌ర్య‌ట‌న లో ఎంపీగా రేణుక‌..ఎమ్మెల్యే గా ఎస్వీ మోహ‌న రెడ్డి తిరిగి పోటీ చేస్తార‌ని చెప్పారు. ఇక, టిడిపి తుది జాబితాలో టిజి భ‌ర‌త్ కే సీటు కేటాయిస్తూ నిర్ణ యం తీసుకున్నారు. ఇక్క‌డ వైసిపి నుండి మైనార్టీ వ‌ర్గానికి చెందిన హ‌ఫీజ్ ఖాన్ ను అభ్య‌ర్దిగా ప్ర‌క‌టించారు. దీంతో.. ఇప్పుడు ఎస్వీ మోహ‌న రెడ్డి స్వ‌తంత్ర అభ్య‌ర్దిగా బ‌రిలోకి దిగుతార‌ని చెబుతున్నారు. ఇక్క‌డ 2014 లో గెలిచిన వైసిపి ఎలాగైనా తిరిగి ప‌ట్టు నిల‌బెట్టుకోవాల‌నే లక్ష్యంతో ఉంది. ఇప్ప‌టికే సామాజిక సేవా కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌జ‌లకు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్న భర‌త్ సైతం గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్నారు.

 రాధా కు మొండి చెయ్యి...

రాధా కు మొండి చెయ్యి...

వైసిపి కి రాజీనామా చేసి టిడిపిలో చేరిన వంగ‌వీటి రాధాకు చివ‌ర‌కు ఎక్క‌డా సీటు కేటాయించ లేదు. పార్టీలో స‌ముచి త స్థానం క‌ల్పిస్తామ‌ని చెప్పిన పార్టీ అధినేత ఇప్పుడు సీటు ఇవ్వ‌లేదు. ఆయ‌న‌కు మ‌చిలీప‌ట్నం లేదా అన‌కాప‌ల్లి నుండి ఎంపీ సీటు కేటాయిస్తార‌ని తొలుత లీకులు ఇచ్చారు. అంతకు ముందు పార్టీలోకి వ‌స్తే ఎమ్మెల్సీ సీటు ఇస్తామ ని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అస‌లు ఎక్క‌డా సీటు ఇవ్వలేదు. పార్టీ స‌భ‌ల్లో రాధాను ప‌రిచ‌యం చేసి..ఆయ‌న్ను అభినం దించటం మిన‌హా..రాజ‌కీయంగా ఎలాంటి అవ‌కాశాలు క‌ల్పిస్తారో మాత్రం స్ప‌ష్ట‌త ఇవ్వ‌టం లేదు. దీంతో..రాధా సైతం లోలోప‌ల ఆందోళ‌న‌తో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. కేవ‌లం జ‌గ‌న్ పై విమ‌ర్శ‌ల కోస‌మే రాధాను పార్టీలోకి తీసుకున్నారా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇక‌, ఇప్పుడు టిడిపి అభ్య‌ర్దులు సైతం పూర్తి స్థాయిలో ప్ర‌క‌టించటంతో వైసిపి వ‌ర్సెస్ టిడిపి సిస‌లైన రాజ‌కీయ పోరు మ‌రింత రంజుగా మారుతోంది.

English summary
TDP Given Chance for ex mp sabbam Hari from Bhimili assembly constituency in Visakha. TG Venkatesh son Bharath got chance from Kurnool Assembly segment. Vangaveeti Radha not contesting in elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X