సబితా ఇంద్రారెడ్డి కాళ్ల మీద పడ్డారు (పిక్చర్స్)
హైదరాబాద్: మాజీ మంత్రి, చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి ఇంటి ఎదుట మహేశ్వరం అసెంబ్లీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం ఉదయం ధర్నా చేశారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని, రాజేంద్రనగర్‌కు మారవద్దని వారు నినాదాలు చేశారు.
అంతటితో ఆగకుండా సబితా ఇంద్రారెడ్డి కాళ్ల మీద పడి వేడుకున్నారు. ఒక అభిమాని ఆవేశానికి గురై వంటి మీద పెట్రోలు పోసుకోవడానికి ప్రయత్నించాడు. మహేశ్వరం సీటును పొత్తుల్లో భాగంగా సిపిఐకి కాంగ్రెస్ అధిష్ఠానం కేటాయించినట్లు సమాచారం లీకైంది.
దీంతో ఆ నియోజకవర్గంకు చెందిన కార్యకర్తలు హతాశులయ్యారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తాను రాజేంద్రనగర్‌కు మారనని హామీ ఇచ్చారు. మహేశ్వరం నుంచే పోటీ చేస్తానని చెప్పారు.

కార్యకర్లు ఇలా ధర్నా..
మహేశ్వరం సీటును కాంగ్రెసు సిపిఐకి కేటాయిస్తుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెసు కార్యకర్తలు సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు.

రాజేంద్రనగర్‌కు మారవద్దు...
మహేశ్వరం నుంచే పోటీ చేయాలని కాంగ్రెసు కార్యకర్తలు సబితా ఇంద్రారెడ్డిని కోరారు. రాజేంద్రనగర్ సీటుకు మారవద్దని విజ్ఞప్తి చేశారు.

సిపిఐకి కేటాయించవద్దు..
సిబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద మహేశ్వరం నియోజకవర్గం కార్యకర్తలు ధర్నా చేశారు. మహేశ్వరం శాసనసభ సీటును సిపిఐకి కేటాయించవద్దని కోరారు.

నచ్చజెప్పిన కార్తిక్ రెడ్డి..
ఇంటి ముందు ధర్నాకు దిగిన కాంగ్రెసు పార్టీ కార్యకర్తలకు సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications