ఏం.. మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?

ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు.

ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్. తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ- ఆ తరువాత తాజాగా మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా 50 శాతం టారిఫ్ భారం పడింది.. భారత్ పై.

Sadineni Yamini strongly criticised the US tariff on India

ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాలపై మరో విడత టారిఫ్ పెంచడానికి, ఆంక్షలు విధించడానికి అవకాశాలు లేకపోలేదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. సెకెండరీ ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయనీ పేర్కొన్నారు.

దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అనంతరం వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ లో విలేకరులతో మాట్లాడారు. రష్యా నుంచి భారత్ క్రూడాయిల్ ను దిగుమతి చేసుకోవడాన్ని జాతీయ భద్రతకు ముప్పుగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో భారత్ దిగుమతులపై 25 శాతం అదనపు టారిఫ్ ను విధించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.

ఈ పరిణామాలపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, ఆ పార్టీ నేషనల్ కౌన్సిల్ సభ్యురాలు సాదినేని యామిని శర్మ ఘాటుగా స్పందించారు. అమెరికా తీసుకుంటోన్న నిర్ణయాలపై ఘాటు విమర్శలు గుప్పించారు. దీన్ని ఫైనాన్షియల్ బ్లాక్‌మెయిల్‌గా ఆమె అభివర్ణించారు.

విజయవాడలో పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ఇటువంటి చర్యలు అన్యాయం, అవాస్తవం, రాజ్యాంగ, దౌత్య విరుద్ధమైనవని ఆమె అన్నారు. పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరిని యామినీ శర్మ ఈ సందర్భంగా తప్పు పట్టారు. థర్డ్ పార్టీ ద్వారా వాణిజ్య కార్యక్రమాలు కొనసాగించే పాశ్చాత్య దేశాలు.. భారత్ ను నేరుగా లక్ష్యంగా చేసుకోవడం ఆశ్చర్యకరమని ఆమె అన్నారు.

ఎనర్జీ, ట్రేడింగ్, లేదా ఇతర అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా వంటి దేశాల ఒత్తిళ్లకు తలొగ్గకుండా భారత్ తన జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తూనే ఉంటుందని, ప్రజలకు అనుకూల నిర్ణయాలను తీసుకుంటుందని ఆమె స్పష్టం చేశారు. సముద్రయానం, వస్త్రాలు, వ్యవసాయం వంటి కీలక రంగాలకు ఎటువంటి హానిని ప్రభుత్వం సహించదని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఎంఎస్‌ఎంఈలు, ఎగుమతిదారులు, రైతుల ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+