చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను మగాడ్నే, శైలజ చెప్పింది నమ్మొద్దు: శాడిస్ట్ భర్త రాజేష్, ‘ఆ ఊరికి పెళ్లి కష్టాలు!’

|
Google Oneindia TeluguNews

Recommended Video

రాజేష్ మగాడంటే నమ్మేదే లేదు.. తొలిరాత్రే చెప్పాడు..!

చిత్తూరు: తొలి రాత్రి రోజే కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేసిన రాజేష్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అంతేగాక, తాను ఏ తప్పు చేయలేదంటూ చెబుతున్నాడు. తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డాడు.

శాడిస్టు భర్త: తొలి రాత్రే నవవధువుకు నరకం చూపాడు, పరిస్థితి విషమం శాడిస్టు భర్త: తొలి రాత్రే నవవధువుకు నరకం చూపాడు, పరిస్థితి విషమం

గంగాధర నెల్లూరు మండలం మోతరంగనపల్లికి చెందిన రాజేష్‌.. వి.కోటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అతడికి నవంబర్‌ 1న గంగాధర నెల్లూరు మండలం దామరగుంటకు చెందిన శైలజతో పెళ్లైంది. కాగా, తొలిరాత్రి నాడే భార్య శైలజపై తీవ్రంగా దాడిచేశాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

శాడిస్ట్ భర్త కేసులో ఊహించని మలుపు: 18 రకాల పొటెన్సీ టెస్ట్‌లు, పాజిటివ్, బెయిల్ శాడిస్ట్ భర్త కేసులో ఊహించని మలుపు: 18 రకాల పొటెన్సీ టెస్ట్‌లు, పాజిటివ్, బెయిల్

నేను మగాడ్నే..

నేను మగాడ్నే..

కాగా, జైలు నుంచి బెయిల్‌పై శుక్రవారం విడుదలైన సందర్భంగా రాజేష్ మీడియాతో మాట్లాడాడు. ‘ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 45 రోజుల పాటు నా కన్నతల్లిని చూడకుండా చేశారు. పైగా నేను మగాడ్ని కాదంటూ, సంసారానికి పనికిరాడని నాపై అభాండాలు వేశారు. నేను మగాడ్నే. మెడికల్‌ బోర్డు కూడా నా లైంగిక పటుత్వ పరీక్షలు పరీక్షించి ఎలాంటి లోపం లేదని నివేదిక ఇచ్చింది.' అని పేర్కొన్నాడు.

తొలిరాత్రే నరకం చూపాడు

తొలిరాత్రే నరకం చూపాడు


శైలజను వివాహమాడిని ఉపాధ్యాయుడు రాజేష్‌.. తొలిరాత్రి రోజునే ఆమెను చిత్రహింసలకు గురిచేసి తీవ్రంగా గాయపర్చడంతో పోలీసులు నిందితుడితో పాటు అతని తండ్రిని సైతం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

శైలజ ఆరోపణల్లో వాస్తవం లేదు

శైలజ ఆరోపణల్లో వాస్తవం లేదు


రాజేష్, అతని తండ్రికి న్యాయస్థానం బెయిల్‌ ఇవ్వడంతో శుక్రవారం చిత్తూరు నగరంలోని జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. తన నిర్దోషిత్వంపై న్యాయ పోరాటం చేసి నిరూపించుకుంటాననని రాజేష్ చెప్పాడు. పోలీసుల దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానన్నాడు. శైలజ తనపై చేసిన ఆరోపణలన్నీ అబద్దమన్నాడు. తనను శాడిస్ట్‌తో పోల్చొద్దంటూ కోరాడు.

రాజేష్ ఎఫెక్ట్‌: పెళ్లి సంబంధాలు కుదరడం లేదు

రాజేష్ ఎఫెక్ట్‌: పెళ్లి సంబంధాలు కుదరడం లేదు

ఇది ఇలావుంటే.. రాజేష్ ఉదంతంతో తమ పిల్లలకు పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మోతరంగనపల్లి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తుున్నారు. ఇప్పటికే మూడు పెళ్లి సంబంధాలు వెళ్లిపోయాయని తెలిపారు. సంసారానికి పనికిరాడంటూ రాజేష్‌పై నిందలు వేశారని, పటుత్వ పరీక్షలో అతడికి ఎటువంటి లోపం లేదని తేలిందన్నారు. ఎవరో చేసిన పనికి తమ ఊరి పరువు తీయొద్దని గ్రామస్తులు కోరుతున్నారు.

English summary
Sadist husband Rajesh talks to media after being released from the jail on bail who was accused by her wife for saying he is not fit for a marital life. He said will give his support for the further case investigation and said the allegations against him are false.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X