ప్రణబ్ సమక్షంలో మంత్రి శైలజనాథ్ సమైక్యం, నినాదాలు

సంజీవ రెడ్డి గారి శతజయంతి సభళో మాట్లాడటాన్ని తాను అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రసంగం మధ్యలో శైలజానాథ్ సమైక్యాంధ్ర గురించి మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే శక్తి రాష్ట్రపతికి ఉందన్నారు. తన ప్రసంగాన్ని కూడా శైలజానాథ్ జై సమైక్యాంధ్ర, జై హింద్ అంటూ ముగించారు.
అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. అనంతపురం బిడ్డ నీలం సంజీవ రెడ్డి దేశానికే గర్వకారణమన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంల ద్వారా లక్షళ ఎకరాల్లో సాగు జరుగుతుందంటే నీలం వల్లనే అన్నారు. వ్యవసాయానికి, చదువుకు ఆయన ప్రధాన్యమిచ్చారన్నారు. నీలం రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చారన్నారు.
పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి నీలం అన్నారు. రాజకీయ నాయకుడు అంటే సంజీవరెడ్డిలా ఉండాలనేలా పేరు తెచ్చుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా పని చేశారని, కేంద్ర, రాష్ట్రాల్లో అనేక కీలక బాధ్యతలు చేపట్టారన్నారు. నీలం సంజీవ రెడ్డి వజ్రమని, అత్యంత నిరాడంబరుడు అని గవర్నర్ నరసింహన్ అన్నారు.












Click it and Unblock the Notifications