వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ నిషేధం వైసీపీకీ వర్తింపు- ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో నడి రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ- హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన జీవో నంబర్ 1పై రాజకీయంగా రచ్చ మొదలైంది. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నిర్వహించిన కందుకూరు, గుంటూరు సభల్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఏకంగా 11 మంది మరణించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసింది. విషాదకర సంఘటనలను నివారించాలనే లక్ష్యంతో దీన్ని అమలులోకి తీసుకొచ్చింది.

ఆ రెండు ఘటనలతో..

ఆ రెండు ఘటనలతో..

కందుకూరు, గుంటూరుల్లో చంద్రబాబు సభల్లో చోటు చేసుకున్న దుర్ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. రోడ్లపై బహిరంగ సభలను ఏర్పాటు చేయడాన్ని నిషేధించింది. ర్యాలీలను చేపట్టడంపైనా ఉక్కుపాదం మోపింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేశారు. వాటిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు.

నిషేధం పకడ్బందీగా..

నిషేధం పకడ్బందీగా..


జాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్డు-రవాణా మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్న రోడ్లపై బహిరంగ సభలు గానీ, ర్యాలీలను గానీ నిర్వహించడాన్ని నిషేధించింది ప్రభుత్వం. మున్సిపాలిటీల ఆధీనంలో ఉన్న రోడ్లను కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చింది. పంచాయతీ రాజ్‌ రహదారులపైన ఈ ఉత్తర్వులు అమలవుతాయని స్పష్టం చేసింది. ఇరుకు రోడ్లు, సందుల్లో సభలను నిర్వహించడానికి, ర్యాలీలను చేపట్టడానికి అనుమతి లేదని వివరించింది.

ప్రతిపక్షాలు భగ్గు..

ప్రతిపక్షాలు భగ్గు..

దీనిపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేసే హక్కు రాజకీయ పార్టీలకు ఉందని, దాన్ని అణచివేయడానికే జగన్ ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చిందంటూ ఆరోపిస్తోన్నాయి. ఇదే నెలలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ చేపట్టదలిచిన పాదయాత్రతో పాటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించతలపెట్టిన వారాహి బస్సు యాత్రను అడ్డుకోవడానికే ఈ జీవో తెచ్చారనే విమర్శలు షురూ అయ్యాయి.

సజ్జల క్లారిటీ..

సజ్జల క్లారిటీ..

వాటన్నింటినీ తోసిపుచ్చారు ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఈ జీవో వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. అధికార పార్టీకి మినహాయింపులేవీ లేవని అన్నారు. ఏ ఒక్క పార్టీకో లేదా సంఘానికో పరిమితం కాదని తేల్చి చెప్పారాయన. వైఎస్ఆర్సీపీ కూడా ఈ జీవోలో పొందుపరిచిన నిబంధనలను వైసీపీ సహా అన్ని పార్టీలూ అనుసరించాల్సి ఉంటుందని వివరించారు.

ఆ విషయం ఎక్కడా చెప్పలేదే..

ఆ విషయం ఎక్కడా చెప్పలేదే..

కొందరు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు దీన్ని చీకటి జీవోగా అభివర్ణిస్తోన్నారని, అలాంటి ఆరోపణలు చేయడంలో అర్థం లేదని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. జీవోలోని నిబంధనలు ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే కాదు.. వైసీపీకి కూడా వర్తిస్తాయని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు అస్సలే నిర్వహించకూడదని తాము ఎక్కడా చెప్పలేదని, ఆ విషయాన్ని జీవోలో పొందుపర్చలేదని గుర్తు చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా గ్రౌండ్స్‌ లల్లో నిర్వహించుకోవచ్చని అన్నారు.

వెసలుబాటు ఉంది..

వెసలుబాటు ఉంది..

జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్‌ కమిషనర్ల అనుమతి తీసుకుని అలాంటి ప్రదేశాల్లో బహిరంగ సభలు, ర్యాలీలను నిర్వహించే వెసలుబాటును కూడా కల్పించామని సజ్జల పేర్కొన్నారు. జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఇచ్చే గైడ్ లైన్స్ ను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుందని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్ల మీద, ఎక్కడపడితే అక్కడ సభలు, ర్యాలీలను జరపడం సరికాదని అన్నారు.

English summary
Sajjala Rama Krishna Reddy given clarity on the critics over Ban on Public meetings on roads
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X