సజ్జల టెలికాన్ఫరెన్స్: టీడీపీ- జనసేన వ్యూహాలు వెల్లడి ..!!
అమరావతి: ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీనితోపాటు లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోనుంది రాష్ట్రం. దీని కోసం అన్ని పార్టీలు సమయాత్తమౌతోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం, బీజేపీ, జనసేన.. ఎన్నికల దిశగా కసరత్తు సాగిస్తోన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్- వై నాట్ 175 నినాదంతో దూసుకెళ్తోన్నారు.
ఈ పరిణామాల మధ్య వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. కొద్దిసేపటి కిందటే ఆయన పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జీలు, పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలతో మాట్లాడారు. పలు కీలక అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు.

వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుందని సూచించారు. దీనికి అనుకూల వాతావరణం ఏర్పడిందని చెప్పారు. మరో తొమ్మిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి క్యాడర్ మొత్తం సంసిద్ధంగా ఉండాలని, ప్రతిరోజూ కీలకమేనని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని చెప్పారు.
ఓటర్ల జాబితా సవరణల్లో పార్టీ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సజ్జల విజ్ఞప్తి చేశారు. దొంగఓట్లను తొలగించడం, అర్హులైన వారిని ఓటర్ల జాబితాలో చేర్పించడం వంటి పరిణామాలపై చురుగ్గా వ్యవహరించాలని అన్నారు సజ్జల. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఎన్నో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉంటూ వచ్చిన చుక్కల భూములు, అసైన్డ్ భూములను తాము పరిష్కరించామని సజ్జల గుర్తు చేశారు. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, దీనివల్ల జరిగిన మేలు గురించి వివరించాలని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో పార్టీ పరిశీలకులు అత్యంత కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు.
వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థపై బురదజల్లే ప్రయత్నాలను తిప్పికొట్టాలని సజ్జల సూచించారు. వలంటీర్లపై హ్యూమన్ ట్రాఫికర్లు అనే ముద్ర వేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తోన్నామని స్పష్టం చేశారు. వలంటీర్లు, సచివాలయాల వల్ల ప్రతి ఒక్కరికీ ప్రయోజనాలు కలుగుతున్నాయని, వాటిపై ప్రతిపక్షాలు చేస్తోన్న విధ్వేషపూరిత ప్రచారంపై ఎదురుదాడి చేయాలని అన్నారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications