ఇదే మంచి అవకాశం.. ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు: సజ్జల
బీసీ కులాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నాయని ఆ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బీసీలకు రాజకీయ గుర్తింపు, ప్రాధాన్యత కల్పించింది తమ ప్రభుత్వమేనని అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాల సాధికార అధ్యక్షులతో ఆయన సమావేశం అయ్యారు. జగన్ హయాంలో చేపట్టిన బీసీ సాధికార కార్యక్రమాల గురించి వివరించారు.
ఈ సమావేశంలో పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, బీసీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటరమణ, పార్టీ ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, కార్యదర్శి అంకంరెడ్డి నాగనారాయణ మూర్తి, 48 బీసీ కులాల సాధికార అధ్యక్షులు, పలువురు నాయకులు హాజరయ్యారు. వివిధ స్థాయిలలో కమిటీ నిర్మాణ స్వరూపం, ఇతర ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. బీసీ కులాలకు ఒక ఉనికిని తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వమేనని, వెనుకబడిన కులాలకు ఒక సమగ్ర విధానం తీసుకొచ్చి అందరికీ అభివృద్ది ఫలాలు అందేలా చేశారని అన్నారు. ప్రతిపక్షం అనేది మనకు ఒక మంచి అవకాశం అని, వెనకబడిన కులాలు అందరినీ చైతన్యపరిచి, జగన్ వల్ల మాత్రమే తమకు భవిష్యత్ ఉంటుందనే ఆలోచన తీసుకురావాలని సూచించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని, ఇక ఏ మాత్రం జాప్యం చేయొద్దని అన్నారు.
జగన్ ఆలోచనలు, విధానాలను బీసీ కులాల్లోకి మరింతగా తీసుకెళ్ళాలని దిశానిర్దేశం చేశారు సజ్జల. గత ప్రభుత్వ హయాంలో తాము ప్రజలకు చేసిన మంచి ఎక్కడికీ పోలేదు, అందరికీ అర్ధమౌతోందని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయారని, టీడీపీ ఫేక్ ప్రచారంతో అబద్దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తోందని, దీన్ని ధీటుగా ఎదుర్కోవాలని చెప్పారు. వాస్తవాలను ప్రజల ముందుంచాలని, సోషల్ మీడియాలో పార్టీ గళాన్ని బలంగా వినిపించాలని అన్నారు.
రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని జగన్ గతంలో రాజకీయంగా మంచి స్ధానం కల్పించారని అన్నారు. జగన్ ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు బీసీ కులాలంతా ఏకం కావాలని, వైసీపీ ప్రభుత్వంలో వెనకబడిన కులాలకు జరిగిన మేలు ఎవ్వరూ మరిచిపోరని చెప్పారు. కూటమి ప్రభుత్వం బీసీలను వంచిస్తోందని, అబద్దపు హామీలు, మాయమాటలతో నిలువునా ముంచిందని ఆరోపించారు.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications