చంద్రబాబు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారా .. లోకేష్ దుబాయ్ వెళ్తుంది అందుకేనా : సజ్జల రివర్స్ ఎటాక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న డ్రగ్స్ స్మగ్లింగ్ విమర్శలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు పైత్యం పరాకాష్టకు చేరింది అని సజ్జల రామకృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారా అని ప్రశ్నిస్తూ లోకేష్ కు దుబాయ్ లో ఏం పని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు . రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ప్రతిపక్షాల నాయకులు ప్రభుత్వంపై కావాలనే విష ప్రచారాలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని విమర్శించారు.

డ్రగ్స్ ఇష్యూను ఏపీకి అంటగట్టాలని చూస్తున్నారన్న సజ్జల

డ్రగ్స్ ఇష్యూను ఏపీకి అంటగట్టాలని చూస్తున్నారన్న సజ్జల

రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారాన్ని వైసీపీ నేతలకు ఎలా లింక్ పెట్టాలా అని చూస్తున్నారని, టీడీపీ నేతలు స్కెచ్ వేస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ ఇష్యూను ఏపీకి అంటగట్టాలని చూస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, తమకు అనుకూలమైన మీడియాలో అడ్డమైన కథనాలు రాయించుకుంటున్నారు అని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. హెరాయిన్ వంటి డ్రగ్స్ కు ఏపీ అడ్డాగా మారిందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పారు.

 టిడిపి వాళ్ళు డ్రగ్స్ బిజినెస్ లోకి దిగారేమో అన్న అనుమానం

టిడిపి వాళ్ళు డ్రగ్స్ బిజినెస్ లోకి దిగారేమో అన్న అనుమానం

దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహారం ఉందని, తెలుగుదేశం పార్టీ నేతలకే ఇలాంటి దందాలపై గట్టి పట్టు ఉందని సజ్జల అభిప్రాయం వ్యక్తం చేశారు. టిడిపి వాళ్ళు డ్రగ్స్ బిజినెస్ లోకి దిగారేమో అన్న అనుమానం కలుగుతోందని సజ్జల అభిప్రాయపడ్డారు. ఏపీ పేరుతో పట్టుబడిన హెరాయిన్ కేసును కేంద్ర నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని పేర్కొన్న ఆయన డ్రగ్స్ కేసులో ఎవరెవరున్నారో దర్యాప్తులో తేలుతుంది అంటూ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో గంజాయి రవాణా చూసీచూడనట్లు వదిలేశారని, సీఎం జగన్మోహన్ రెడ్డి గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

 గంజాయిపై ఉక్కుపాదం మోపింది జగన్ సర్కార్

గంజాయిపై ఉక్కుపాదం మోపింది జగన్ సర్కార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి రవాణాపై అధికారులు విస్తృత దాడులు చేస్తున్నారని పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి, గత ఏడాది కాలంలో 2 లక్షల 50 వేల కేజీల గంజాయిని సీజ్ చేశామని సజ్జల పేర్కొన్నారు. కావాలని చంద్రబాబు ప్రతి దాన్ని వివాదం చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబును ప్రతిసారీ ప్రజలు తిరస్కరిస్తున్నా .. ఇంకా సిగ్గు లేదని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా దానిని ఏపీ తో లింక్ పెట్టి బురద చల్లేందుకు టిడిపి నేతలు ప్రయత్నిస్తున్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

Recommended Video

    గణేష్ నిమజ్జనోత్సవానికి రావడం ఆనందంగా ఉందన్న భక్తులు!!
    చంద్రబాబు డ్రగ్స్ బిజినెస్ .. లోకేష్ దుబాయ్ వెళ్తుంది అందుకేనా ? సజ్జల ప్రశ్న

    చంద్రబాబు డ్రగ్స్ బిజినెస్ .. లోకేష్ దుబాయ్ వెళ్తుంది అందుకేనా ? సజ్జల ప్రశ్న

    చంద్రబాబు తాను సంపాదించిన డబ్బులు డ్రగ్స్ వ్యాపారంలోకి మళ్లించారని విమర్శించారు. రాజకీయంగా ఎదుగుదల లేకపోవడంతో చంద్రబాబు కుటుంబం డ్రగ్స్ బిజినెస్ లోకి దిగిందా అంటూ ప్రశ్నించారు. దుబాయ్ లో నారా లోకేష్ ఏం చేస్తున్నారని, అలాగే చంద్రబాబు కూడా హాంకాంగ్, సింగపూర్, మాల్దీవులు, మారిషస్ వెళ్లారని .. చంద్రబాబు, లోకేష్ లు వెళ్ళేది అందుకేనా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. వేల కోట్ల విలువైన డ్రగ్స్ కేసులో ఎవరెవరు ఉన్నారో దర్యాప్తులో బయటకు వస్తుందని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు హద్దు పొద్దు లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై విష ప్రచారం చేసే లబ్ధి పొందాలని ప్రయత్నం జరుగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+