ఏపీలో ఉనికి లేని పార్టీకి ఏపీ గురించి దేనికి? మేం బిచ్చమెత్తుకుంటే మీకెందుకు?టీఆర్ఎస్ పై సజ్జల

తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై, ఏపీ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలతో మొదలైన రాజకీయ దుమారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఇక ఏపీలోని అధికార వైసిపి, తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ కు మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది.

ఏపీ సీఎంపై తెలంగాణా మంత్రి వ్యాఖ్యలతో మొదలైన రగడ

ఏపీ సీఎంపై తెలంగాణా మంత్రి వ్యాఖ్యలతో మొదలైన రగడ

తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలంగాణ ఏర్పడితే ఇక్కడి ప్రజలు అడుక్కుతింటారని అప్పటి మంత్రులు, నేతలు చెప్పారని, ప్రస్తుతం ఏపీలో అదే పరిస్థితి వచ్చిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిధుల కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్రం వద్ద అడుక్కునే పరిస్థితి ఏర్పడిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రస్తుతం ప్రభుత్వం నడవాలంటే కేంద్ర ప్రభుత్వం అందించే నిధులు కావాలని వ్యాఖ్యానించిన ఆయన కేంద్ర ఒత్తిడితోనే రైతుల మోటార్లకు మీటర్లు పెట్టారని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి అలా లేదని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఘాటుగా రిప్లై ఇచ్చిన పేర్ని నాని, రివర్స్ ఎటాక్ చేసిన సజ్జల

ఘాటుగా రిప్లై ఇచ్చిన పేర్ని నాని, రివర్స్ ఎటాక్ చేసిన సజ్జల

ఇక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని ఘాటుగానే రిప్లై ఇచ్చారు. తెలంగాణ సీఎం కెసిఆర్ మాదిరిగా బయట కాలరెగరేసి లోపల కాళ్ళు పట్టుకోవడం తమ సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియదని తెలంగాణా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. జగన్ ఎప్పుడూ ఒకే విధానంతో ముందుకు వెళతారని స్పష్టం చేశారు. పెద్ద పాల కుండ లాంటి హైదరాబాదు ఉండి కూడా తెలంగాణ అప్పులపాలు అయిందని, తెలంగాణ ఎంత అప్పు చేసిందో బ్యాంకులను అడిగితే తెలుస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. ఇక తాజాగా టిఆర్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణా నేతలకు మేం ఎలా పోతే మీకు ఏంటని ప్రశ్న

తెలంగాణా నేతలకు మేం ఎలా పోతే మీకు ఏంటని ప్రశ్న

కేంద్రం నుంచి రావాల్సినవి తెచ్చుకోవడం తమ హక్కని సీఎం కేసీఆర్ చెప్పారని, నిధులు రాబట్టే విషయంలో మిగిలిన వారికి కూడా అదే హక్కు ఉంటుందని, ఆ దిశగానే ఏపీ సర్కార్ ప్రయత్నం చేస్తుందని సజ్జల రామకృష్ణ రెడ్డి వ్యాఖ్యానించారు. మేము బిచ్చమెత్తుకుంటే మీకేంటని ఆయన ఘాటుగా బదులిచ్చారు. కేంద్రం నుంచి నిధులు రావాల్సిన పద్ధతుల్లో రాబట్టుకుంటున్నామని చెప్పిన ఆయన, వాళ్లు ఎలా వెళ్లాలో వాళ్లు చూసుకోవాలని, మేం ఎలా పోతే మీకు ఏంటని ఆయన గట్టిగా ప్రశ్నించారు.

రాజకీయ అజ్ఞానం తో తెలంగాణా నేతలు మాట్లాడుతున్నారు

రాజకీయ అజ్ఞానం తో తెలంగాణా నేతలు మాట్లాడుతున్నారు

తెలంగాణ నేతలు ఈవిధంగా మాట్లాడటం రాజకీయ అజ్ఞానం అవుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టిఆర్ఎస్ పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో ఎలాంటి ఉనికి లేదని,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేని పార్టీ ఇక్కడి విషయాల గురించి మాట్లాడడం దేనికని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. వాళ్ల సమస్యల నుండి ప్రజల దృష్టి మరల్చడం కోసమే తెలంగాణ నేతలు ఇలా ఏపీ గురించి మాట్లాడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అన్ని రకాలుగా వనరులు ఉన్నా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉందని రాష్ట్రాన్ని విడదీసి అన్యాయం చేశారని తాను ఎప్పుడైనా అన్నామా అంటూ ప్రశ్నించిన సజ్జల రామకృష్ణారెడ్డి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టారని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెప్పిందని, అది మేము ఫాలో అయితే తప్పేంటి అంటూ ప్రశ్నించారు.

ఏపీలో టీడీపీ, తెలంగాణాలో టీఆర్ఎస్ .. రెండూ ఒకటే

ఏపీలో టీడీపీ, తెలంగాణాలో టీఆర్ఎస్ .. రెండూ ఒకటే

మీటర్ల బిగింపు వల్ల రైతులకు నష్టం జరిగిందని చెప్పడం కరెక్ట్ కాదని, ఎవరు ఎంత విద్యుత్తు వాడుకుంటున్నారు మీటర్లు బిగించటం ద్వారా తెలుస్తోందని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి ఏ విధంగా మాట్లాడుతుందో, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ అట్లాగే మాట్లాడుతుందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏపీ అప్పల పాలైందని చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ నేతల పై ఫైర్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి విద్యుత్ రంగంలో మా హయాంలో ఎంత అప్పు ఉందో, మీ హయాంలో ఎన్ని అప్పులు ఉన్నాయో పయ్యావుల కేశవ్ లెక్క చెప్పాలని ప్రశ్నించారు.

 ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయే నాటికే 70 వేల కోట్లకు పైగా అప్పు

ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయే నాటికే 70 వేల కోట్లకు పైగా అప్పు

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయే నాటికి 70 వేల కోట్ల పైనే అప్పులు పెట్టి పోయిందని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి . ఇక రాష్ట్రంలో 2.49 పైసలకే సెకీ ద్వారా సోలార్ విద్యుత్ ను తీసుకొస్తున్నామని, వచ్చే 25 ఏళ్ళ పాటు ఉచిత విద్యుత్ ను రైతుల హక్కుగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని సజ్జల రామ కృష్ణా రెడ్డి పేర్కొన్నారు. తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తూ అధిక భారాన్ని తగ్గించుకుంటున్నాము అని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి.

Recommended Video

    రైతులకు అన్యాయం జరిగితే సహించమన్న భట్టి విక్రమార్క || Oneindia Telugu
    దక్షిణాది రాష్ట్రాల సీఎం ల భేటీలో విభజన హామీలపై చర్చ

    దక్షిణాది రాష్ట్రాల సీఎం ల భేటీలో విభజన హామీలపై చర్చ

    రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం అనేది రాజకీయ విధానాలకు సంబంధించిన అంశం అని ప్రస్తావించారు. ఇక ఇదే సమయంలో విభజన అంశాలపై మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని, విభజన చట్టంలోని వివిధ అంశాలపై దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశంలో సీఎం జగన్ మాట్లాడతారని పెర్కొన్నాటు. ఇదే సమావేశంలో మూడు రాజధానుల ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని కోరతామని చెప్పారు. తెలంగాణా నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూనే అనేక అంశాలపై స్పష్టత ఇచ్చారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+