దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్ లో సజ్జలకూ పాత్ర, పోటాపోటీగా కేసులు!
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ సీరియల్ లో వివాహేతర సంబంధం కారణంగా ఈ పంచాయతీ రోడ్డెక్కింది. ఇక వీరి పంచాయతీని ఎలా పరిష్కరించాలో పోలీసులకు కూడా అంతు చిక్కటం లేదు. దువ్వాడ శ్రీనివాస్ తమతోనే ఉండాలని భార్య వాణి కోరుతున్నారు. అయితే శ్రీనివాస్ తనను వాణి చంపేందుకు కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు.
దువ్వాడ ఫ్యామిలీ పంచాయితీ .. సజ్జలతో లింక్
ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన కంప్లైంట్ తో వాణి, హైందవి మరో ముగ్గురు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక వాణి ఫిర్యాదుతో దువ్వాడ శ్రీనివాస్, ఆయన సోదరుడి పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ పంచాయతీ రచ్చకెక్కడానికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణమని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది.

సజ్జల వద్దకు దువ్వాడ ఫ్యామిలీ పంచాయితీ
దువ్వాడ శ్రీనివాస్ గత మూడు ఏళ్లుగా మాధురి అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమెతోనే ఉంటున్నారని ఆయన భార్య పిల్లలు పార్టీ హైకమాండ్ వద్ద పంచాయతీ పెట్టారు. అప్పుడు ఈ పంచాయతీని సజ్జల రామకృష్ణారెడ్డి చేశారు. ఆస్తులు, వ్యాపారాలను భార్యా పిల్లలపైకి మార్చుతానని సజ్జల రామకృష్ణారెడ్డి ముందు దువ్వాడ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని దువ్వాడ నిలబెట్టుకోలేదు.
టికెట్ ఇస్తామని వాణిని బుజ్జగించిన సజ్జల
పైపెచ్చు దువ్వాడ శ్రీనివాస్ మాధురి కోసం ఆస్తులు నాశనం చేస్తున్నారని వాణి మరో మారు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లింది అప్పుడే తను ఆందోళన చేస్తానని హెచ్చరిస్తే, గొడవలు వద్దు ఈసారి టిక్కెట్ మీకే ఇస్తామని ఆమెను బుజ్జగించి పంపించిన సజ్జల టెక్కలి నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఆమెను ప్రకటించారు.
ఎన్నికల్లో పోటీ చేసిన వాణికి సజ్జల బుజ్జగింపు
ఇక ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి జరిపిన సర్వేలో ఆమె గెలిచే అవకాశం లేదని వాణికి టికెట్ ను నిరాకరించారు దీంతో ఇండిపెండెంట్ గా పోటీకి వాణి రెడీ అయింది. అయితే మరో మారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆమెను బుజ్జగించి దువ్వాడ శ్రీనివాస్ తో ఆస్తులని వాణి, వాణి కూతురు పేరు మీదకి రాయిస్తానని చెప్పి పోటీ నుంచి విరమించేలా చేశారు.
ఓటమి తర్వాత దువ్వాడ వ్యవహారాన్ని పట్టించుకోని సజ్జల
ఇక గత ఎన్నికల్లో వైసిపి ఓటమిపాలైన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్నారు. దీంతో దువ్వాడ వాణి భర్త తనతో కాకుండా వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడాన్ని టార్గెట్ చేసి రోడ్డుకు ఎక్కారు. ఇక పోలీస్ స్టేషన్లో దాకా వెళ్లి మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు.
సజ్జల సైలెన్స్ తో రోడ్డెక్కిన మొగుడు పెళ్ళాలు
అయితే దువ్వాడ వ్యవహారం సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకు వచ్చినప్పుడు భార్య పిల్లలతో కలిసి ఉండాలని దువ్వాడను మందలిస్తే, లేదా వాణి కోరినట్టు తల్లి కూతుర్లకు న్యాయం చేయగలిగితే ఇప్పుడు ఈ పంచాయతీ రోడ్డు మీదకు వచ్చేది కాదు. ఇప్పుడు టెక్కలి నియోజకవర్గంలో ఈ వ్యవహారమే పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications