చంద్రబాబు కథ ఇప్పటికే ముగిసింది కానీ, టీడీపీ, జనసేన కలిసినా: సజ్జల రామకృష్ణా రెడ్డి సెటైర్లు

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ, జనసేన లోపాయికారి ఒప్పందాలకు వెళ్లాయని ఆరోపించారు. సోమవారం సజ్జల మీడియాతో మాట్లాడారు. కుప్పం కోట తొలిసారి బద్దలైందన్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కాడి పడేసిందన్నారు.

టీడీపీ, జనసేన కలిసినా..: సజ్జల ఫైర్

టీడీపీ, జనసేన కలిసినా..: సజ్జల ఫైర్

టీడీపీ, జనసేన ఒకే తాను గుడ్డలని ఎద్దేవా చేశారు. అందరూ కలిసి పోరాడిన వైసీపీకి భారీ మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ క్లీన్ స్వీప్ చేస్తున్నామన్నారు. ఏళ్ల తరబడి చంద్రబాబు చేతుల్లో కుప్పం మగ్గిపోయిందని.. బయట ఓటర్లను తీసుకొచ్చిన అలవాటు చంద్రబాబుకు ఉందన్నారు.
కుప్పంలో 8 వేల దొంగ ఓట్లు ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారన్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రజల ఆశీర్వాదం ఉందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఐఎస్‌ అధికారులు, ఐపీఎస్‌ అధికారులంటే చంద్రబాబు చిన్న చూపు చూస్తారని మండిపడ్డారు.

చంద్రబాబు కథ ఇప్పటికే ముగిసింది.. : సజ్జల

చంద్రబాబు కథ ఇప్పటికే ముగిసింది.. : సజ్జల

తమ ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు స్వేచ్ఛను ఇచ్చామన్నారు. కొత్త తరం రాజకీయాలను చంద్రబాబు చూడాలని, ఆయన ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని సజ్జల వ్యాఖ్యానించారు. దొంగ ఓట్లు వేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఓటమికి సాకులు వెతకడంలో చంద్రబాబు దిట్ట అని సజ్జల ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయం ఇప్పటికే తెలిసిపోయిందన్నారు సజ్జల. తనను గుర్తించకుంటే అది మీ ఓటమి అని అనడం చంద్రబాబు అహంకారానికి నిదర్శనమి సజ్జల రామకృస్ణారెడ్డి మండిపడ్డారు. ఇదే అహంకారంతో లోకేష్‌ కూడా వ్యవహరిస్తున్నాడన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజా అభిప్రాయాన్ని గౌరవించడం నేర్చుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు.

చంద్రబాబుదంతా వెన్నుపోటు రాజకీయమేనంటూ సజ్జల

చంద్రబాబుదంతా వెన్నుపోటు రాజకీయమేనంటూ సజ్జల

సీఎం జగన్‌ మంచి పనులు చేస్తున్నారు కనుకనే ప్రజలు ఆదరిస్తు న్నారని సజ్జల చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని, సకాలంలో వర్షాలు పడుతున్నాయని, పంటలు పండుతున్నాయని యువతకు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ప్రజలంతా సంతోషంగా ఉన్నారని సజ్జల చెప్పారు. ఇవేమీ తెలియకుండా చంద్రబాబు కేవలం అధికారం లేదనే ఎప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాష్ర్టంలో ఏదో ఒక అలజడి సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలను తెలుసుకుని ప్రజల్లో ఉండి రాజకీయం చేయాలన్నారు. ఆయనదంతా వెన్నుపోటు రాజకీయమేనని చంద్రబాబును ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Recommended Video

    రైతులకు అన్యాయం జరిగితే సహించమన్న భట్టి విక్రమార్క || Oneindia Telugu
    కుప్పంలో ఏం జరిగిన చంద్రబాబు ఖాతాలోనే..: సజ్జల

    కుప్పంలో ఏం జరిగిన చంద్రబాబు ఖాతాలోనే..: సజ్జల


    కుప్పంలో ఉన్న 37 వేల ఓటర్ల గురించి జనరల్ ఎన్నికల మాదిరిగా చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తిని 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా భరించినందుకు బాధ కలుగుతుందన్నారు. జగన్ ప్రభుత్వంలో సంక్షేమం ద్వారా అభివృద్ధిని ప్రజలంతా చూస్తున్నారని.. స్థానిక ఫలితాలే కుప్పం టౌన్‌లో రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఫలితాలు అలా రాకపోయినా మునిగిపోయేది ఏమీ లేదన్నారు సజ్జల. పోలింగ్ బూత్‌లో మీ ఏజెంట్‌లు ఉన్నప్పుడు దొంగ ఓట్లు ఎలా వేస్తారు? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. కుప్పంలో ఏది జరిగినా చంద్రబాబు ఖాతాలోనే పడుతుందన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+