పిఎస్‌లో విజయమ్మ, బెజవాడలో అశోక్‌బాబు(పిక్చర్స్)
హైదరాబాద్/విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఆ పార్టీ శాసన సభ్యులు తెలుగు తల్లి విగ్రహం వద్ద నుండి అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేయడంతో శనివారం పోలీసులు వారిని అడ్డుకొని గాంధీ నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
దీంతో విజయమ్మ సహా పార్టీ ఎమ్మెల్యేలు గాంధీ నగర్ పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. వారు శనివారం గవర్నర్ నరసింహులును కలిసి సమైక్యాంధ్రకు మద్దతుగా వినతి పత్రం ఇచ్చారు. మరోవైపు శుక్రవారం విజయవాడలో ఎపిఎన్జీవో సభ జరిగింది.
ఈ సభలో పలువురు వక్తలు ఆకట్టుకన్నారు. ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు క్లుప్తంగా నిమిషాల పాటు మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని సభలో హెచ్చరించారు. రాజకీయ స్వార్థం కోసమే నాయకులు వేర్పాటవాదం తీసుకు వచ్చారన్నారు.

ధర్నా
తెలుగు తల్లి విగ్రహం వద్ద ర్యాలీ చేస్తున్న తమను అడ్డుకోవడంతో గాంధీ నగర్ పోలీసు స్టేషన్‌లో ఆందోళన చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు

విజయమ్మ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ బయటకు వస్తున్న దృశ్యం.

టిడిపి లేఖ
తెలంగాణపై ఇచ్చిన లేఖను తెలుగుదేశం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డు పట్టుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు.

శోభానాగి రెడ్డి
రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో ఓటింగ్ జరపాలనే ప్లకార్డుతో గాంధీ నగర్ పోలీసు స్టేషన్ ధర్నా వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు.

మాట్లాడుతున్న విజయమ్మ
పార్టీకి ఎమ్మెల్యేలతో కలిసి విలేకరులతో మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ.

సేవ్ ఆంధ్రప్రదేశ్
కృష్ణా జిల్లా విజయవాడలోని సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలో వేదిక పైన ఎపిఎన్జీవో సభ్యుడు అధ్యక్షుడు అశోక్ బాబు, చలసాని తదితరులు.

హాజరైన సమైక్యవాదులు
విజయవాడలో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభకు పెద్ద ఎత్తున సమైక్యవాదులు తరలి వచ్చారు. వర్షం కురుస్తున్నా సభ పూర్తయ్యే వరకు కూర్చున్నారు.

వర్షంలోను
విజయవాడలో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభకు పెద్ద ఎత్తున సమైక్యవాదులు తరలి వచ్చారు. వర్షం కురుస్తున్నా సభ పూర్తయ్యే వరకు కూర్చున్నారు.

వేదికపై
కృష్ణా జిల్లా విజయవాడలో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలో వేదికపై నుండి సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకుల అభివాదం దృశ్యం.












Click it and Unblock the Notifications