వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో మళ్లీ ఇసుక సంక్షోభం ? ఎన్దీటీ ఆదేశాలతో జగన్ సర్కార్ కు షాక్-చంద్రబాబు టైంలో 100 కోట్ల ఫైన్

|
Google Oneindia TeluguNews

ఇసుక అక్రమాలకూ, ఏపీకి ఎప్పుడూ అవినాభావ సంబంధం ఉంటుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇసుకను సంప్రదాయ, సంప్రదాయేతర ఆదాయ మార్గంగా మార్చుకోవడం జరుగుతూనే ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై కన్నెర్ర చేసిన ఎన్టీటీ రూ.100 కోట్ల జరిమానా విధించింది. దీంతో కొన్ని నెలల పాటు ఇసుక తవ్వాలంటేనే అధికారులు గజగజ వణికిపోయారు. దీంతో దాదాపు ఏడాది పాటు ఇసుక సంక్షోభం తప్పలేదు. ఇప్పుడు తాజాగా ఎన్టీటీ ఇచ్చిన ఆదేశాలతో మరోసారి అదే పరిస్ధితి దాపురించేలా కనిపిస్తోంది.

 ఇసుక అక్రమ తవ్వకాలు

ఇసుక అక్రమ తవ్వకాలు

ఏపీలో ప్రవహించే కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా, వంశధారతో పాటు మరికొన్ని నదులు, వాటి ఉపనదులు, కాలవల్లో లభించే ఇసుకకు ఎంతో విలువ ఉంది. దీన్ని సొంతం చేసుకుంటే చాలు అతి తక్కువ సమయంలో కోట్లాది రూపాయలు అర్జించవచ్చని అక్రమార్కులు భావిస్తుంటారు. ఇందుకు కావాల్సిందల్లా ప్రభుత్వాల చలవ మాత్రమే. ప్రభుత్వాలు కాస్త తమ విధానాల్ని మార్చుకుని, తమకు సహకరిస్తే స్వల్ప కాలంలో వేల కోట్లు ఆర్ఝించవచ్చని అక్రమార్కులు వ్యూహరచన చేస్తుంటారు. విచిత్రంగా ప్రభుత్వాలు కూడా ఇందుకు సహకరిస్తూ సహజవనరుల్ని అక్రమార్కులు కొల్లగొడుతున్నా చోద్యం చూస్తుంటాయి. కోట్లాది రూపాయల ముడుపుల భాగోతాలే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తుంటాయి.

 టీడీపీ హయాంలో ఇసుక తవ్వకాలు

టీడీపీ హయాంలో ఇసుక తవ్వకాలు

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరిగిపోయేది. ప్రభుత్వం చూసీ చూడనట్లుగా వ్యవహరించడంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇసుకాసురులుగా మారిపోయి కోట్లాది రూపాయల సహజవనరులు కొల్లగొట్టేవారు. ఇలా రాష్ట్రంలోని నదుల్లో పట్టపగలే అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం ఐదేళ్లపాటు పట్టించుకోలేదు. చివరికి జాతీయ హరిత ట్రైబ్యునల్ కు ఫిర్యాదులు అందడంతో విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ అక్రమాలను నిగ్గు తేల్చడంతో ఎన్టీటీ ఏకంగా రూ.100 కోట్ల జరిమానా విధించింది. చివరికి ప్రభుత్వ ఖజానా నుంచి ఈ వెయ్యికోట్లు కట్టి ఊరట పొందాల్సిన పరిస్దితులు తలెత్తాయి. దీంతో అప్పటివరకూ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు విని నోరు మెదపని అధికారులు కాస్తా అతి సున్నితంగా మారిపోయారు. అధికారికంగా ఇసుక తవ్వి అమ్మకాలు చేపట్టాల్సి ఉన్నా పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోయారు. దీంతో 2019 మే నెలలో మొదలైన ఇసుక సంక్షోభం కనీసం ఏడాది పాటు కొనసాగింది.

 వైసీపీ ఇసుక విధానాలు

వైసీపీ ఇసుక విధానాలు

టీడీపీ హయాంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎప్పటికప్పుడు తీవ్ర విమర్శలు చేస్తూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్నిటార్గెట్ చేసిన వైసీపీ.. తాము అధికారంలోకి వచ్చాక మాత్రం ఇసుక సంక్షోభంలో కూరుకుపోయింది. దీనికి కారణం అప్పటికే జరిగిన అక్రమాలపై ఎన్టీటీ వందకోట్లు ఫైన్ విధించడంతో అధికారులు తవ్వకాలు ఆపేశారు. కానీ ఈ ప్రభావం వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగానే పడింది. అధికారులు ఎన్టీటీ ఆదేశాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అప్రమతంగా ఉండాలని కోరారు. దీంతో వైసీపీ సర్కార్ కొత్త ఇసుక విధానం రూపొందించుకోవాల్సి వచ్చింది. ఈ కొత్త విధానం 2019 సెప్టెంబర్ లో అందుబాటులోకి వచ్చినా అప్పటికే మొదలైన ఇసుక కొరత మాత్రం తీరలేదు. అనతి కాలంలోనే వైసీపీ సర్కార్ ఇసుక విధానాన్ని పలుమార్లు మార్చింది. చివరికి ఇసుక తవ్వకాల్ని ఓ ప్రైవేటు సంస్ధకు కట్టబెట్టేసింది. ఇప్పుడు ఆ ప్రైవేటు సంస్ధ చేస్తున్న తప్పులన్నీ వైసీపీ సర్కార్ మెడకు చుట్టుకునేలా ఉన్నాయి.

 ఎన్టీటీ సీరియస్

ఎన్టీటీ సీరియస్

వైసీపీ సర్కార్ హయాంలో ఇసుక తవ్వకాల కోసం లీజుల్ని జయప్రకాష్ వెంచర్స్ అనే సంస్దకు కట్టబెట్టారు. ఈ సంస్ధ పలు చోట్ల సాగిస్తున్న తవ్వకాల్లో వైసీపీ నేతల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో జేపీ వెంచర్స్ కేంద్రంగా జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఎన్టీటీ తాజాగా సీరియస్ అయింది. అక్రమ ఇసుక తవ్వకాల గుట్టు విప్పేందుకు విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా తనిఖీలు చేపట్టి అక్టోబర్ 5లోగా నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించింది. ఈ వివరణ సంతృప్తి కరంగా లేకపోతే ఎన్టీటీ ఏం చేయబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.

 అకాశానికి ఇసుక ధరలు

అకాశానికి ఇసుక ధరలు

ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాల నేపథ్యంలో ధరలు ఆకాశాన్నంటున్నాయి. గతంతో పోలిస్తే ప్రతీ చోటా భారీగా ధర పెరిగింది. అయినా తప్పనిసరి పరిస్దితుల్లో జనం ఇసుక కొనుగోలు చేస్తున్నారు. ఇందులోనూ రవాణా పేరుతో భారీగా దోపిడీ జరుగుతోంది. చంద్రబాబు సర్కారు హయాం తరహాలోనే వైసీపీ సర్కార్ లోనూ ఇసుక సామాన్యుడికి అందుబాటులోకి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వైసీపీ సర్కార్ ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను సైతం ఏర్పాటు చేసింది. ఇందులో వేలాది మంది సిబ్బందిని సైతం నియమించారు. అయినా ఇసుక అక్రమ తవ్వకాలు కానీ, అక్రమ రవాణా కానీ ఆగకపోవడంతో ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఏమీ తెలియనట్లుగా ఇసుక సామాన్యుడికి అందుబాటులోనే ఉందని చెబుతోంది.

Recommended Video

5.1 తీవ్రతతో Earthquake.. AP, Tamil Nadu లోని పలు ప్రాంతాల్లో కంపించిన భూమి..! || Oneindia Telugu
 మళ్లీ ఇసుక సంక్షోభం తప్పదా ?

మళ్లీ ఇసుక సంక్షోభం తప్పదా ?

గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎడాపెడా నదుల నుంచి ఇసుకను అక్రమంగా తవ్వేసిన అక్రమార్కులు.. చివరికి ఎన్టీటీ స్పందించి వెయ్యి కోట్ల జరిమానా విధించడంతో ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు వైసీపీ సర్కార్ హయాంలో మరోసారి పేర్లు మార్చుకుని తెరపైకి వచ్చేశారు. ప్రతీ ర్యాంపులోనూ తమకు సహకరించే వారిని అడ్డుపెట్టుకుని అక్రమాలకు తెరలేపుతున్నారు. దీంతో ఎన్టీటీకి ఫిర్యాదులు అందాయి. ఇప్పుడు ఎన్టీటీ తిరిగి విచారణలకు, సోదాలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈసారి ఎన్టీటీ ఎలాంటి చర్యలు తీసుకోబోతోందోనే అంశం కలకలం రేపుతోంది. గతంలోలా భారీ జరిమానాలు విధించి సరిపెడుతుందా లేక అక్రమాలు రొటీన్ గా మారిపోయినందున అధికారులపైనా చర్యలు తీసుకుంటుందా అనేది తేలాల్సి ఉంది. అయితే ఎన్టీటీ ఉత్తర్వుల ప్రభావంతో తవ్వకాలకు బ్రేక్ పడితే మాత్రం మరోసారి రాష్ట్రంలో ఇసుక సంక్షోభం తప్పకపోవచ్చని తెలుస్తోంది.

English summary
national green tribunal has ordered to conduct raids in sand ramps in andhrapradesh amid allegations of illegal mining.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X