హైదరాబాద్‌లో రోడ్లు ఊడ్చిన సానియా మీర్జా (వీడియో)
హైదరాబాద్: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా టెన్నిస్ స్టార్ సానియా మిర్జా హైదరాబాద్‌లోని ప్రశాసన్ నగర్‌లో పాల్గొన్నారు. ప్రశాసన్ నగర్‌లోని రోడ్లపై ఉన్న చెత్తను సానియా మిర్జా చీపురు పట్టి ఊడ్చారు.
సానియా మిర్జా ప్రశాసన్ నగర్‌కు రావడంతో అక్కడ ప్రాంతమంతా సందడిగా మారింది. స్వచ్చ భారత్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడంపై సానియా ప్రశంసలు కురిపించారు. అనంతరం స్వచ్ఛ భారత్‌లో కార్యక్రమంలోకి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి. సింధు, షూటర్ అభినవ్ బింద్రాలను సానియా మిర్జా ఆహ్వానించారు.

స్వచ్ఛభారత్‌లో పాల్గొన్న సానియా మిర్జా వీడియో చూడండి:
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/3Hxc3beee5M?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>
అంతక ముందు ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సానియా మిర్జా అనిల్ అంబానీ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నానని, త్వరలో సమయం చూసుకుని సింగపూర్‌లో జరగనున్న డబ్ల్యూటీఏ చాంపియన్ షిప్‌కు వెళ్ళే లోపే స్వచ్ఛ్ భారత్‌లో పాల్గొంటానన్న విషయం తెలిసిందే.
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్‌ను ప్రధాని మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సినీ నటులను, ప్రముఖులను ఆహ్వానించారు. మోడీ ఆహ్వానించినవారిలో 9 మందిలో బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, ప్రియాంక చోప్రా, శశిథరూర్, సచిన్ టెండూల్కర్, తారక్ మెహతా, అనిల్ అంబానీ, మృదుల సిన్హా, బాబా రాందేవ్ తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications