వివాహేతర సంబంధం: రూ.3 లక్షలకు భర్తను హత్య చేయించి ఇలా...

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్టణం:వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది భార్య. భర్తను హత్య చేయించి సాధారణ మృతిగా చిత్రీకరించింది.అయితే కిరాయి హంతకుల ద్వారా విషయం మూడు మాసాల తర్వాత వెలుగుచూసింది.ఈ ఘటన విశాఖ పట్టణంలో చోటుచేసుకొంది.

విశాఖ జిల్లాలోని కంచరపాలెం వాసి డబ్బూరి సంతోష్ కుమార్ రైల్వేలో కలాసి గా పనిచేసేవాడు. అయితే అతడి భార్య కరుణ జ్యోతిని స్థానికుడైన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై భార్య కరుణ జ్యోతితో భర్త సంతోష్ కుమార్ నిత్యం గొడవ పడేవాడు.

santosh kumar murdered for extra marital affair in visakhapatnam

గత ఏడాది సెప్టెంబర్ మాసంలో కరుణ జ్యోతి ప్రియుడు, సంతోష్ కుమార్ మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్టోబర్ లో మర్రిపాలెం శివనగర్ కు ఇల్లు మారాడు సంతోష్ కుమార్ .అయినా భార్య, భర్తల మధ్య గొడవలు ఆగలేదు.

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంగా భర్తను హత్య చేయించాలని భార్య భావించింది. ఈ మేరకు ముసిరి బాలరాజు, గుజ్జుల చిరంజీవి, పిల్లా అప్పన్నకుమార్ తో పాటు మరో ఇద్దరికి మూడు లక్షలకు సంతోష్ కుమార్ ను చంపేందుకు ఒప్పుకొన్నారు. ఈ మేరకు కరుణజ్యోతి, ఆమె ప్రియుడు కిరాయి హంతకులతో ఒప్పందం కుదుర్చుకొని రూ.5 వేలు అడ్వాన్స్ గా ఇచ్చారు.

గత ఏడాది నవంబర్ 26వ, తేదిన శివనగర్ లో మద్యం మత్తులో ఉన్న సంతోష్ కుమార్ ను ఊపిరాకుండా చేసి హత్య చేశారు హంతకముఠా సభ్యులు. అయితే అతిగా మద్యం సేవించడం వల్లే తన భర్త మరణించాడని కరుణజ్యోతి స్థానికులను , బంధువులను నమ్మించింది.

మూడు నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో హంతకముఠా సభ్యులు తమ డబ్బుల కోసం విశాఖపట్టణం వచ్చారు.మద్యం తాగి తెల్లవారుజామున రోడ్డుపై వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం వెలుగుచూసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
santosh kumar murdered for extra marital affair in visakhapatnam. this incident happend 3 months back, karuna jyothy wife of santosh kumar planned this murdered. she and her lover agreement rowdysheeters for santosh kumar murder.
Please Wait while comments are loading...