హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సరయూలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం

|
Google Oneindia TeluguNews

Sarayu River tragedy: Dead bodies of Chakrapani, Kiran found
అయోధ్య/హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని సరయూ నదిలో గల్లంతైన ఇద్దరు వేద విద్యార్థుల మృతదేహాలు గురువారం ఉదయం లభ్యమయ్యాయి. విద్యార్థుల మృతదేహాలను హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అయోధ్యలో జరిగే రామాయణ సుందరకాండ పారాయణం కోసం మెదక్ జిల్లా వర్గల్ వేద పాఠశాల నుంచి 40 మంది వేద విద్యార్థుల బృందం జూన్ 30న బయలుదేరి వెళ్లారు.

బుధవారం తెల్లవారుజామున స్నానం చేయడానికి విద్యార్థులంతా నదిలోకి దిగగా వీరిలో చక్రపాణి(20), కిరణ్ (19)గల్లంతైన విషయం తెలిసిందే. చక్రపాణి స్వస్థలం హైదరాబాద్ మల్కాజిగిరిలోని గౌతంనగర్ డివిజన్. కిరణ్ స్వస్థలం కృష్ణా జిల్లా కాగా, హైదరాబాద్‌లోని డబీర్‌పురా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.

విద్యార్థుల మరణ వార్త విన్న వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇటీవల విహార యాత్రకు వెళ్లిన 24 మంది తెలుగు విద్యార్థిలు బియాస్ నదిలో కొట్టుకుపోయి మృతి చెందిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది.

English summary
The dead bodies of the missing youth Chakrapani (20) and Kiran (19) have been traced out, early on Thursday morning, from Sarayu River.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X