అమరావతిలో సర్దార్ విగ్రహం: చంద్రబాబు, బిజెపిపై రఘువీరా ఫైర్
విజయవాడ/ హైదరాబాద్: దేశ ఐక్యతను కాపాడిన మహానేత సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వల్లభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా ఎ.కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఏక్తా దివస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో సంస్థానాల విలీనానికి పటేల్ కృషి ఎనలేనిదని కొనియాడారు. జాతి గుర్తుంచుకోదగిన నేత పటేల్ అని అన్నారు. సర్దార్ పటేల్ విగ్రహాన్ని రాష్ట్ర రాజధాని అమరావతిలో నెలకొల్పుతామని ఆయన చెప్పారు.
వల్లభాయ్ పటేల్ ఆలిండియా సర్వీసెస్‌ను స్థాపించారన్నారు. పటేల్ జీవితం యువతకు ఆదర్శమన్న సీఎం ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

కాగా, హైదరాబాదులోని ఇందిరాభవన్‌లో ఇందిరాగాంధీ వర్ధంతి, వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రఘువీరా రెడ్డి, కేవీపీ, పలువురు నేతలు హాజరయ్యారు. భారత్‌ను సుస్థిరమైన దేశంగా నిలిపిన ఘనత ఇందిరాగాంధీదేనని నేతలు చెప్పారు.
హస్తం గుర్తుతో అభయం ఇచ్చిన ఉక్కు మహిళ ఇందిరా అని వారు అభివర్ణించారు. బీజేపీ చేసే పనులకు, పటేల్ ఆశయాలకు పొంతన లేదనీ, పటేల్ పేరు చెప్పే అర్హత బీజేపీకి లేదని ఏపీసీసీ చీఫ్ రఘువీరా విమర్శించారు.
ఉక్కు మనిషికి సెల్యూట్
సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్‌కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. భారత ఉక్కు మనిషి వల్లబ్ భాయ్ పటేల్‌కు సెల్యూట్ అంటూ ఆయన ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications