'సత్యం' రామలింగరాజు కేసు తీర్పు ఏప్రిల్ 9కి వాయిదా
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు తీర్పు ఏప్రిల్ 9కి వాయిదా పడింది. నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం, మోసం, నకిలీ పత్రాల అభియోగాలు అప్పటి సత్యం కంప్యూటర్స్ ఛైర్మన్ రామలింగరాజు నమోదయ్యాయి. ఆరేళ్ల నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది. కాగా, సోమవారం కోర్టు తీర్పును ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.
కంపెనీ వాస్తవ ఆదాయాన్ని అధికంగా చూపి షేరు ధరను తాత్కాలికంగా భారీగా పెంచేసిన అప్పటి సత్యం కంప్యూటర్స్ ఛైర్మన్ రామలింగరాజు, షేర్ మార్కెట్‌ను మోసం చేశారు. 2009 జనవరి 7న ఒక్కసారిగా వాస్తవం వెలుగులోకి రావడంతో కంపెనీ షేరు భారీగా పడిపోయింది.

దీంతో ఇన్వెస్టర్లు నిండా మునిగిపోయారు. స్టాఫ్ట్‌వేర్ రంగాన్ని పెను కుదుపు కుదిపిన ఈ కేసులో రామలింగరాజు సహా పలువురు అరెస్టయ్యారు. సుదీర్ఘకాలంగా ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు విచారణ ముగిసినట్లు గత డిసెంంబర్ 23న ప్రకటించింది.
విచారణలో భాగంగా 3వేల పత్రాలను పరిశీలించిన న్యాయస్థానం 226మంది సాక్షులను విచారించింది. 2015 మార్చి 9న తీర్పు వెలువరించనున్నట్లు వెల్లడించింది. మార్చి 9న ఈ కేసు తీర్పును ఏప్రిల్ 9కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications