సత్యమేవ జయతే దీక్ష.. ఢిల్లీ నుండి గల్లీ దాకా టీడీపీ నిరసన దీక్షలు!!

టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి, జైలుకు పంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ అక్రమ అరెస్టు అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గాంధీ జయంతి రోజున సత్యమేవ జయతే అంటూ టిడిపి వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టింది. దీంతో ఢిల్లీ నుంచి గల్లీ దాకా సత్యమేవ జయతే నిరసన దీక్షలను నిర్వహిస్తున్నారు.

నాడు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీని బ్రిటిష్ పాలకులు జైలుకి పంపారు. నేడు రాష్ట్రంలో సాగుతున్న ఫ్యాక్షన్ పాలనపై ప్రజల పక్షాన పోరాడుతున్న చంద్రబాబుని జైలులో అక్రమంగా నిర్బంధించారని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ చంద్రబాబు కోసం ఐయామ్ విత్ సీబీఎన్ అంటూ దీక్ష చేపట్టారు.

Satyameva Jayate Deeksha..

టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ని నిరసిస్తూ సత్యమేవ జయతే దీక్ష చేపట్టిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టిడిపి ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర, కేశినేని నాని, టిడిపి నేత కంభంపాటి రామ్మోహన్ రావు, ఇతర ముఖ్యనేతలు బాబుతో నేను అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.


అంతకుముందు గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనం కోసం జన్మించిన మహాత్ముడు, దేశ స్వేచ్ఛా స్వాతంత్ర్యమే లక్ష్యంగా జీవించిన మహనీయుడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. సత్యం, అహింస ఆయుధాలుగా అందించిన బాపూజీ మన ధర్మపోరాటానికి స్పూర్తి ఆయన వెల్లడించారు.

మరొకవైపు రాజమండ్రిలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నారా భువనేశ్వరి సత్యమేవ జయతే దీక్షలో పాల్గొంటున్నారు. రాజమహేంద్రవరం వేదికగా భువనేశ్వరి సత్యమేవ జయతే దీక్షలో పాల్గొంటున్నారు. చంద్రబాబు కోసం భువనేశ్వరి కి మద్దతు తెలుపుతూ తెలుగు మహిళా నాయకులు ఈ దీక్షలో పాల్గొంటున్నారు.


చంద్రబాబు పై జగన్ సర్కార్ తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్ట్ చేసిందని, చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా మంగళగిరి నియోజకవర్గంలో "సత్యమేవ జయతే" దీక్ష చేపట్టిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, పట్టాభి వంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సత్యమేవ జయతే దీక్షలో పాల్గొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+